Gold PriceToday: దిగొస్తున్న ధర, నెల కనిష్టం

 Gold Price Today: Yellow Metal Slides One Month LowSilver Falls - Sakshi

ఫెడ్‌ రేటు పెంపు అంచనాలు 

దిగొస్తున్న పుత్తడి ధర

రూ. 1100   తగ్గిన కిలో వెండి 

సాక్షి, న్యూఢిల్లీ: పసిడి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. ఎంసీఎక్స్‌ మార్కెట్లో  గురువారం  ఒక నెల కనిష్టానికి చేరాయి.  10 గ్రాముల బంగారం  47,799 రూపాయలు పలుకుతోంది.  మరో విలువైన మెటల్‌ వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది. జూలై వెండి ఫ్యూచర్స్ కిలోకు రూ .70,332గా ఉంది. ప్రధానంగా అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌కీలక వడ్డీ రేట్లను  ఊహించిన దానికంటే ముందుగానేభారీగా పెంచనుందన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో, 2023 లో వడ్డీ రేటు పెంపు జరగవచ్చని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు సూచించారు.  దీంతో బుధవారం పుత్తడి ధర ఒకశాతం తగ్గింది.   తాజాగా 2.31 శాతం ధర పడిపోవడంతో ఔన్స్‌ పసిడి ధర 1,821 డాలర్లు పలుకుతోంది. ఇక   గురువారం నాటి మార్కెట్‌లో  హైదరాబాద్‌లో కూడా  గోల్డ్‌ ధర దిగొచ్చింది.  నేడు (జూన్ 17 ) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 160 క్షిణించి రూ.49,470కు తగ్గింది. 22 క్యారెట్ల  122 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.150 క్షిణించి రూ. 45,350కు తగ్గింది. జూన్ 11 తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విలువ 50 వేలుపైనే పలికిన సంగతి తెలిసిందే.  వెండి ధర  కిలోకు 1.10 శాతం లేదా 1100 రూపాయలు తగ్గి కిలో రూ.75100 గా ఉంది.

చదవండి: Edible oil: వినియోగదారులకు భారీ ఊరట
Microsoft Chairman 2021 : నూతన ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top