Gold And Silver Price Today: ఈసీబీ వడ్డీరేటు: బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి!

Gold and Silver RateToday 22 July: details here - Sakshi

సాక్షి, ముంబై:  అంతర్జాతీయ మార్కెట్లో ధరలతో తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధరలు  క్రమంగా దిగొస్తున్నాయి. ఇప్పటికే భారీగా తగ్గిన  పసిడి ధర శుక్రవారం రివర్స్‌ అయింది. బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్  ప్రకారం స్పాట్‌ మార్కెట్‌లో 999 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల క్రితం ముగింపు  49,972  రూపాయలతో పోలిస్తే 705 పెరిగింది,  ప్రారంభ ధర రూ. 50,677గా ఉంది, అలాగే వెండి కిలో  ధర   1,178 పెరిగి  రూ. 55,085 పలుకుతోంది. 

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) గురువారం వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచినప్పటికీ   బంగారం ధరలు తగ్గాయి. స్పాట్ బంగారం ధర ఔన్సుకు 1716  డాలర్లు పలుకుతోంది. గురువారం ముగింపుతో పోలిస్తే దాదాపు 0.25 శాతం తక్కువ. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్‌  ధర స్వల్పంగా తగ్గి  10 గ్రాములకు రూ 50,361గా ఉంది.  ఎంసీక్స్‌ మార్కెట్లో బంగారం ధర సమీప కాలంలో 10 గ్రాములు రూ. 49,300 వరకు తగ్గవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి."గురువారం బంగారం ధరలు దాదాపు ఏడాదిలో కనిష్ట స్థాయికి పడిపోయాయి.

జూలై 27న 2022న జరగనున్న సమావేశంలో ఫెడ్ వడ్డీ రేటును పెంచుతుందనే ఊహాగానాలపై డాలర్ ఇండెక్స్ పెరుగుతుందని కమోడిటీ మార్కెట్ నిపుణుల భావిస్తున్నారు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి గురువారం రూ.50,180 వద్ద ఉండగా శుక్రవారం 50620గా ఉంది. 22 క్యారెట్ల రూ.46,400గా  ఉంది. కిలో వెండి  200  రూపాయలు క్షీణించి 55400 పలుకుతోంది. గ్లోబల్‌ మార్కెట్లో ఔన్స్‌  వెండి 18. 76 డాలర్లుగా ఉన్నది.

కాగా దేశీయంగా దిగుమతి సుంకం పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల డిమాండ్ ఐదు శాతం తగ్గి 550 టన్నులకు చేరుకోనుందని తాజా నివేదికలో తేలింది.  జూన్ 30, 2022న బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top