ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా | gold and silver rates today on market in telugu states | Sakshi
Sakshi News home page

ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా

Apr 2 2025 12:32 PM | Updated on Apr 2 2025 5:35 PM

gold and silver rates today on market in telugu states

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కొంత శాంతించినట్లు కనిపించినా తిరిగి జీవితకాల గరిష్టాలను చేరుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.85,100 (22 క్యారెట్స్), రూ.92,840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. దేశ రాజధాని నగరం దిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.85,250కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.92,990గా ఉంది. బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులు చెందలేదు. స్థిరంగా ఉన్నాయి.

ఇదీ చదవండి: దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్‌ మిండా

వెండి ధరలు

బంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లే వెండి ధరల్లోనూ బుధవారం ఎలాంటి మార్పులు రాలేదు. కేజీ వెండి రేటు(Silver Price) ప్రస్తుతం రూ.1,14,000గా ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఐదేళ్లలో రెండింతలు దాటిన బంగారం ధరలు

Advertisement
 
Advertisement
Advertisement