తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే? | Gold And Silver Price Today 9th July 2024 | Sakshi
Sakshi News home page

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Jul 9 2024 2:56 PM | Updated on Jul 9 2024 3:20 PM

Gold And Silver Price Today 9th July 2024

క్రమంగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. మళ్ళీ తగ్గుదల మొదలైంది. ఈ రోజు కూడా గోల్డ్ రేట్లు గరిష్టంగా రూ. 380 తగ్గింది. దీంతో నిన్నటి ధరల కంటే ఈ రోజు (జులై 9) ధరలు మళ్ళీ తగ్గాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67100 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73720 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 350, రూ. 380 తగ్గాయి.

ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 380 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67250 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73350 వద్ద ఉంది.

హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67700.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 73850 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గింది.

వెండి ధరలు
జులై నెలలో వెండి ధరలు మొదటిసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు (జులై 9) కేజీ వెండి ధర రూ. 94500 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధర కంటే ఈ రోజు వెండి ధర రూ. 500 తగ్గింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement