శ్రావణ మాసంలో పపిడి ప్రియులకు తొలి షాక్ ఎదురైంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. శుభకార్యాల సీజన్ శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పెరగకుండా, తగ్గుతూ, స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు నేడు (ఆగస్టు 9) భారీగా పెగిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుదల ఇలా..
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.750 పెరిగి రూ.64,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.820 ఎగిసి రూ. 70,090 లను తాకింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు పెరిగాయి.
ఇతర నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.750 పెరిగి రూ.64,400 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 820 పెరిగి రూ.70,240 లకు హెచ్చింది. ఇక చెన్నై విషయానికి వస్తే  22 క్యారెట్ల బంగారం రూ.750 ఎగిసి రూ.64,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.820  రూ.70,090 వద్దకు చేరింది.
వెండి ధరలు..
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు భారీగా ఎగిశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం వెండి రేటు కేజీకి రూ.1500 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.88,000 లను తాకింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
