దేశవ్యాప్తంగా బంగారం ధరలు రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఎగిసిన పసిడి ధరలు నేడు (ఆగస్టు 26) నిలకడగా ఉన్నాయి. దేశంలో బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.
విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లతో సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,950 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 73,040 వద్ద స్థిరంగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు కొనసాగున్నాయి.
అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు ఎలాంటి మార్పూ లేకుండా నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.67,100 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,190 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో సోమవారం స్వల్ప తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.92,900 వద్దకు వచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
