ప్చ్‌.. బంగారం ముందే కొనుంటే బావుండు! | Gold and Silver Price Today 24 August 2024 | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. బంగారం ముందే కొనుంటే బావుండు!

Aug 24 2024 12:21 PM | Updated on Aug 24 2024 12:44 PM

Gold and Silver Price Today 24 August 2024

దేశంలో రెండురోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు ఎగిశాయి. దేశవ్యాప్తంగా శనివారం (ఆగస్టు 24) పసిడి ధరలు మోస్తరుగా పెరిగాయి. శ్రావ‌ణమాసం కావ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, ఇత‌ర శుభ‌కార్యాల నిమిత్తం బంగారం కొనేవారు ధ‌ర‌ల త‌గ్గింపు కోసం ఆస‌క్తి చూస్తున్నారు. రెండు రోజులు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌లు ఈరోజు పెర‌గ‌డంతో ముందే కొనుంటే బావుండు అని నిట్టూరుస్తున్నారు.

ఎక్క‌డెక్క‌డ‌ ఎంత పెరిగిందంటే..
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర రూ.350 పెరిగి రూ.66,950 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.390 పెరిగి రూ. 73,040 వద్దకు ఎగిసింది.

ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. ఇక ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.350 పెరిగి రూ.67,100లకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 పెరిగి రూ.73,190 లను తాకింది.

భారీగా వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు ఒక్క‌సారిగా పెరిగాయి. హైదరాబాద్‌లో శ‌నివారం వెండి కేజీకి రూ.1300 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్క‌డ వెండి ధర కేజీ రూ.93,000 ల‌కు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement
 
Advertisement
Advertisement