దేశవ్యాప్తంగా బంగారం ధరలు రివర్స్ అయ్యాయి. క్రితం రోజున ఎంత మేర పసిడి రేటు పెరిగిందో మళ్లీ ఈరోజు (సెప్టెంబర్ 17) అంతే స్థాయిలో తగ్గి మొన్నటి ధరకు దిగొచ్చింది. అంటే మేలిమి బంగారం తులం (10 గ్రాములు) రూ.75వేల దిగువకు వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ఎంత మేర తగ్గాయంటే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,650 వద్దకు వచ్చింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.160 కరిగి రూ. 74,890 వద్దకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు ఇదే విధంగా తగ్గాయి.
ఇదీ చదవండి: ఈ బ్యాంకులో ఎఫ్‌డీ.. మంచి వడ్డీ!
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ ఈరోజు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,800 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 క్షీణించి రూ.75,040 వద్దకు వచ్చింది.
వెండి ధర వెనక్కి..
దేశవ్యాప్తంగా వెండి ధరలు వెనకడుగు వేశాయి. నిన్నటి రోజున కేజీకి రూ.1000 మేర పెరిగిన వెండి ఈరోజు అంతే మొత్తంలో క్షీణించింది. హైదరాబాద్‌లో మంగళవారం వెండి కేజీకి రూ.1000 తగ్గి రూ.97,000 వద్దకు దిగొచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
