దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (ఆగస్టు 17) భారీగా పెరిగాయి. పసిడి ధరల్లో క్రితం రోజున స్వల్ప కదలిక కనిపించగా నేడు ఒక్కసారిగా ఎగిశాయి. వెండి ధరలు సైతం ఒక్కసారిగా దూసుకెళ్లి కొత్త మార్కును తాకాయి. దీంతో ఈరోజు ఆభరణాలు కొనాలనుకున్నవారికి నిరాశ తప్పలేదు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరీశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.1050 పెరిగి రూ.66,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.1150 ఎగిసి రూ. 72,770 లను తాకింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే రీతిలో ధరలు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో అయితే 22 క్యారెట్ల బంగారం రూ.1050 ఎగిసి రూ.66,850 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ. 1150 పెరిగి రూ.72,920 లకు చేరుకుంది.
వెండి ధరల్లో కొత్త మార్క్
దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు అమాంతం పెరిగాయి. హైదరాబాద్‌లో రెండో రోజులుగా కేజీకి రూ.500 చొప్పున పెరిగిన వెండి ధర శనివారం ఏకంగా రూ.2000 ఎగిసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.91,000 లను తాకింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
