
ఆగష్టు 14న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు గురువారం (ఆగష్టు 15) స్థిరంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.
👉విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65550 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 71510 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.
👉చెన్నైలో కూడా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65550 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 71510 వద్ద ఉన్నాయి.
👉 ఒక్క ఢిల్లీలో మాత్రమే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 100 తగ్గింది. అయితే 24 క్యారెట్ల బంగారం మాత్రం నిన్నటి ధరలతోనే కొనసాగుతోంది. కాబట్టి దేశ రాజధానిలో బంగారం ధరలు వరుసగా రూ. 65,600 (22 క్యారెట్ల 10గ్రా), రూ. 71660 (24 క్యారెట్ల 10గ్రా) వద్ద ఉన్నాయి.
వెండి ధరలు
బంగారం స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం రూ. 500 పెరిగింది. దీంతో బుధవారం రూ. 83000 వద్ద కేజీ వెండి ధర గురువారం రూ. 83500లకు చేరింది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).