గ్లాండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 'శ్రీనివాస్ సాదు' | Gland Pharma New Executive Chairman and CEO Srinivas Sadu | Sakshi
Sakshi News home page

గ్లాండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 'శ్రీనివాస్ సాదు'

Published Sat, Jun 8 2024 1:30 PM | Last Updated on Sat, Jun 8 2024 1:30 PM

Gland Pharma New Executive Chairman and CEO Srinivas Sadu

హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ శుక్రవారం (జూన్ 7) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ సీఈఓగా 'శ్రీనివాస్ సాదు'ను నియమించినట్లు ప్రకటించింది. ఈ నెల 10 నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.

లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ, న్యూయార్క్ నుంచి ఇండస్ట్రియల్ ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన సాదు.. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ నుంచి ఎంబీఏ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ నుంచి ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ వంటి చదువులు చదువుకున్నారు.

వ్యాపార అభివృద్ధి, తయారీ కార్యకలాపాలు, సరఫరా గొలుసు నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలలో సాదుకు 23 సంవత్సరాల అనుభవం ఉంది. ఈయన గత 22 సంవత్సరాలుగా.. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. 2000లో జనరల్ మేనేజర్‌గా, 2002లో సీనియర్ జనరల్ మేనేజర్‌గా, 2003లో వైస్ ప్రెసిడెంట్‌గా, 2005లో డైరెక్టర్‌గా, 2011లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. కాగా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement