3గిఫ్ట్‌ నిఫ్టీ టర్నోవర్‌ రికార్డ్‌ | Gift Nifty Sets Record Single Day Turnover Of 15. 25 Billion dollers | Sakshi
Sakshi News home page

3గిఫ్ట్‌ నిఫ్టీ టర్నోవర్‌ రికార్డ్‌

Sep 28 2023 6:06 AM | Updated on Sep 28 2023 6:06 AM

Gift Nifty Sets Record Single Day Turnover Of 15. 25 Billion dollers - Sakshi

న్యూఢిల్లీ: గిఫ్ట్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఒకే రోజులో 15.25 బిలియన్‌ డాలర్ల(రూ. 1.27 లక్షల కోట్లు) టర్నోవర్‌ను సాధించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. 38.63 లక్షల కాంట్రాక్టుల ద్వారా రికార్డ్‌ నమోదైంది. వెరసి ఈ ఏడాది ఆగస్ట్‌ 29న సాధించిన 12.98 బిలియన్‌ డాలర్ల రికార్డ్‌ టర్నోవర్‌ను అధిగమించినట్లు ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్‌ వెల్లడించింది. నిఫ్టీ–50 ఇండెక్స్‌ ఆధారంగా డాలర్లలో ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులకు గిఫ్ట్‌ నిఫ్టీ వేదికగా నిలిచే సంగతి తెలిసిందే.

ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్‌.. గిఫ్ట్‌ సిటీ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మలీ్టఅసెట్‌ ఎక్సే్ఛంజ్‌. ఈ ఏడాది(2023) జులై 3నుంచి గిఫ్ట్‌ నిఫ్టీలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్‌లో ట్రేడింగ్‌ టర్నోవర్‌ ఊపందుకుంది. పూర్తిస్థాయిలో ట్రేడింగ్‌ మొదలయ్యాక తొలి రోజు నుంచి ఇప్పటివరకూ 4.59 మిలియన్‌ కాంట్రాక్టుల ద్వారా 178.54 బిలియన్‌ డాలర్ల విలువైన టర్నోవర్‌ నమోదైంది. ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్‌ విభిన్న ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. దేశీ సింగిల్‌ స్టాక్‌ డెరివేటివ్స్, ఇండెక్స్, కరెన్సీ, కమోడిటీ డెరివేటివ్స్‌సహా.. డిపాజిటరీ రిసీప్ట్స్, గ్లోబల్‌ స్టాక్స్‌ను ఆఫర్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement