అంబుజాలో అదానీ 4.5 శాతం వాటాల విక్రయం

Gautam Adani Plans To Sell 450 Million Worth Stake In Ambuja Cement - Sakshi

న్యూఢిల్లీ: అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా గ్రూప్‌ రుణభారాన్ని తగ్గించుకోవడంపై అదానీ గ్రూప్‌ చీఫ్‌ గౌతమ్‌ అదానీ దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 4.5 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు 450 మిలియన్‌ డాలర్లుగా  (దా దాపు రూ.3,380) ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఆర్థిక సంస్థలను కూడా సంప్రదించినట్లు పేర్కొన్నాయి.

గతేడాది  కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్‌లో అదానీకి 63 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం అదానీ గ్రూప్‌ రుణ భారం దాదాపు 24 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్‌ షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలతో గ్రూప్‌ కంపెనీల షేర్లు ఇటీవల భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ కొన్ని క్రమంగా కోలుకుంటున్నాయి.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top