మొబైల్స్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు | Sakshi
Sakshi News home page

Facts About Mobile Phones: మొబైల్స్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

Published Fri, Oct 15 2021 7:03 PM

Fun Facts About Mobile Phones  - Sakshi

కాలం మారిపోయింది..సెల్‌ఫోన్ దేహంలో భాగమైపోయింది..ఫోన్ లేనిదే పొద్దు పోవడంలేదు..అత్యవసర పనుల నుంచి.. సరదా కబుర్లకు కూడా సెల్ ఉండాల్సిందే..! అంతెందుకు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ ఫోన్‌తో కమ్యూనికేట్‌ అవ్వొచ్చు. అలాంటి సెల్‌ ఫోన్‌కు ఓ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ గురించి తెలుసా?  

ఉదాహరణకు పీసీ(personal computer)ల కంటే ప్రపంచంలోనే ఎక్కువ మొబైల్ ఫోన్‌లు ఉన్నాయని తెలుసా?

చేతిలో ఫోన్ లేకపోతే పుట్టే  భయాన్ని ఏమంటారో తెలుసా?

అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ పేరేంటో తెలుసా?

మొదటి మొబైల్ ఫోన్ బరువు ఎంతో  తెలుసా? ఇలాంటి ఇంటస్ట్రింగ్‌ ఫ్యాక్స్‌ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని 

మనం వినియోగించే 'స్మార్ట్‌ ఫోన్‌' అసలు పేరు 'సిమోన్‌'. ఈ ఫోన్‌లో క్యాలండర్‌ యాప్స్‌, అడ్రస్‌ బుక్‌, వరల్డ్‌ క్లాక్‌, క్యాలిక్లేటర్‌, నోట్‌ ప్యాడ్‌, ఈమెయిల్‌, ఫ్యాక్స్‌, గేమ్స్‌ ఆడేవారు. టచ్‌ స్క్రీన్‌తో లభించే ఈ ఫోన్‌ ధర వెయ్యి డాలర్లు.

ఫస్ట్‌ సెల్‌ ఫోన్‌ ను 1973లో తయారు చేశారు.ఆఫోన్‌ నుంచి 1992లో ఫస్ట్‌ మెసేజ్‌ పంపారు. 

ఫస్ట్‌ కెమెరా ఫోన్‌ 2002 జపాన్‌లో విడుదలైంది. 

టెక్‌ దిగ్గజం యాపిల్‌ విడుదల చేసిన అన్నీ ఫోన్‌లలో కంటే  ఐఫోన్‌ 5ఎస్‌ ఎక్కువగా అమ్ముడు పోయింది. 2013 సెప్టెంబర్‌ 20న విడుదలైన ఈ ఫోన్‌ ఇప్పటి వరకు 70వేల మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. 

ప్రపంచంలో వాటర్‌ ఫ్రూఫ్‌ ఫోన్‌లు అమ్ముతున్న దేశం జపాన్‌. 

సైంటిస్ట్‌లు తొలిసారి యూరిన్‌ సాయంతో సెల్‌ ఫోన్‌ కు ఛార్జింగ్‌ పెట్టారు.

2015లో ఆపిల్‌ సంస్థ పాత ఐఫోన్లను రీసైకిల్‌ చేసి టన్ను గోల్డ్‌ను వెలికి తీసింది. అలా వెలికి తీసిన ప్రస్తుతం గోల్డ్‌ ధర 40మిలియన్ల (ఇండియన్‌ కరెన్సీలో రూ.2,99,88,62,000.00) ఉంది. 

► మొబైల్‌ ఫోన్‌లను విసిరేయడం ఫిన్‌ల్యాండ్‌లో అధికారిక క్రీడ

► టాయిలెట్ హ్యాండిల్‌ కు ఉన్న బ్యాక్టీరియా కంటే 18 టైమ్స్‌ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన ఫోన్‌లో ఉంది.శాక్రమెంటో బీ రిపోర్ట్‌ ప్రకారం ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, ఆండ్రాయిడ్ ఫోన్‌లు, టచ్ స్క్రీన్‌లపై  బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 

ప్రతిరోజు ఓ వ్యక్తి యావరేజ్‌గా 110 సార్లు తమ స్మార్ట్‌ ఫోన్లను అన్‌ లాక్‌ చేస్తుంటాడు. 

చేతిలో ఫోన్‌ లేకపోతే కలిగే భయాన్ని వైద్య పరిభాషలో నోమో ఫోబియా అంటారు.

1999లో తొలిసారి బెనిఫాన్ ఈఎస్‌ఈ అనే ఫోన్‌లో జీపీఎస్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. 

 2015లో వరల్డ్‌ వైడ్‌ గా 1.4 బిలియన్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. 

హాంకాంగ్‌ పాపులేషన్‌ 7.2 మిలియన్ల మంది ఉండగా..యాక్టీవ్‌గా ఉన్న మొబైల్స్‌ సంఖ్య 17.4 మిలియన్లుగా ఉంది. 

40శాతం స్మార్ట్‌ ఫోన్‌లు దొంగతనానికి గురయ్యే సమయం సాయంత్రం 5 గంటల సమయం లోపలే. 

11శాతం మొబైల్స్‌ దొంగతనం పనిచేసే ప్రదేశాల్లో జరిగినట్లు తేలింది. 

తొలిసారి వాడుకలోకి వచ్చిన స్మార్ట్‌ ఫోన్‌ బరువు 2.5 పౌండ్లు.. అదే ఫోన్‌ ఇప్పుడు యావరేజ్‌గా  250 గ్రాములు.

చదవండి: జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి

Advertisement
 
Advertisement
 
Advertisement