Android Phones : జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి

How to Find Viruses on Android Phones   - Sakshi

కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో  సైబర్‌ క్రైమ్స్‌ విపరీతంగా పెరిగిపోతుంది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపిన గణాంకాల ప్రకారం..కోవిడ్-19 వల్ల 600 శాతం సైబర్‌ క్రైమ్‌ పెరిగినట్లు తెలిపింది. 

ముఖ్యంగా కంప్యూటర్‌ వైరస్‌, ట్రోజన్స్‌, స్పైవేర్‌, రాన్సమ్ వేర్, యాడ్‌వేర్‌, వార్మ్స్, ఫైల్‌ లెస్‌ మాల్వేర్‌ల సాయంతో సైబర్‌ దాడులకు పాల్పడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా హైబ్రిడ్‌ దాడులకు పాల్పడేందుకు ప్రత్యేకంగా మెషిన్‌ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. అందులోనూ మనం తరుచూ వినియోగించే స్మార్ట్‌ ఫోన్‌లపై వైరస్‌ దాడులు పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. 

వైరస్‌ దాడుల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి? 
సైబర్‌ నేరస్తులు స్మార్ట్‌ ఫోన్లు, లేదంటే ఐఫోన్లపై  ప్రత్యేకంగా తయారు చేసిన వైరస్‌లను మెయిల్స్‌ సాయంతో లేదంటే ఆఫర్లు ఇస్తామంటూ పాప్‌ ఆప్‌ యాడ్స్‌ను ఫోన్‌కి సెండ్‌ చేస‍్తుంటారు. ఆ సమయంలో ఫోన్‌ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఏదైనా యాప్స్‌ డౌన్‌ లోడ్‌ చేసుకునే ముందే ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే మంచిదా? లేదంటే దాడులకు పాల్పడే అవకాశం ఉందా అని తెలుసుకోవాలి. అందుకోసం మీరు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకునే సమయంలో సంబంధిత యాప్‌ వివరాలు, రివ్యూలు చెక్‌ చేయాలి.    

వైరస్‌ దాడి చేసినట్లు ఎలా గుర్తించాలి? 

మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌లను గుర్తించే సులభమైన మార్గం ఇదే. మీరు ఒకవేళ ఫోన్‌ రీఛార్జ్‌ చేసుకుంటే..వెంటనే కట్‌ అవ్వడం, మీ స్మార్ట్‌ఫోన్‌కు గుర్తు తెలియని టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ రావడం, మీ అనుమతి  లేకుండా యాప్స్‌ను కొనుగోలు చేయడం.

కంటిన్యూగా మీ ఫోన్‌ కు యాడ్స్‌ వస్తున్నా యాడ్‌ వేర్‌ మీ ఫోన్‌ను అటాక్‌ చేసినట్లు గుర్తించాలి.  

మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్‌ ఫోన్‌ని ఉపయోగించి స్పామ్ టెక్స్ట్ మెసేజ్‌లను మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి సెండ్‌ చేస్తుంటాయి. దీని అర్ధం మీ కాంటాక్ట్‌ ఫోల్డర్‌లోకి గుర్తు తెలియని వైరస్‌ దాడి చేసినట్లు గుర్తించాలి. 
 
మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. 

వైరస్‌లు, మాల్వేర్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త యాప్‌లను కూడా డౌన్‌లోడ్ చేస్తుంటాయి.

ఈ యాప్‌లు, మెసేజ్‌ల వల్ల మీ డేటా అంతా అయిపోయింది.  

 బ్యాటరీ లైఫ్‌ టైమ్‌ తగ్గిపోతుంటాయి. 

పై తరహా ఇబ్బందులు ఎదురవుతుంటే మీ ఫోన్‌లో వైరస్‌ దాడి చేసినట్లేనని గుర్తించాలి. ఒకవేళ అదే జరిగితే మీ ఫోన్‌లో ఉన్న పర్సనల్‌ డేటా కాపీ చేసుకొని..వైరస్‌ తొలగించే ప్రయత్నం చేయండి. ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండండి.

చదవండి: మార్కెట్‌లో మరో బడ్జెట్‌ ఫోన్‌, ఫీచర్లు మాత్రం అదుర్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top