దొంగలించి ‘ట్రేడ్‌-ఇన్‌’ ద్వారా కొత్త ఫోన్‌! | UK Police Accuse Apple of Aiding Stolen iPhone Trade | Apple Denies Allegations | Sakshi
Sakshi News home page

దొంగలించి ‘ట్రేడ్‌-ఇన్‌’ ద్వారా కొత్త ఫోన్‌!

Nov 5 2025 12:45 PM | Updated on Nov 5 2025 1:26 PM

Over 80000 iPhones stolen in London Met Police accuse Apple

యూకే మెట్‌ పోలీస్‌ పార్లమెంట్‌లో నివేదిక

దొంగిలించబడిన ఐఫోన్ల వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నంలో టెక్ దిగ్గజం యాపిల్ సహకరించడం లేదని యూకే మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ (Met Police) తీవ్రంగా ఆరోపించింది. దొంగిలించబడిన ఫోన్లకు క్రెడిట్ పొందేందుకు నేరస్థులు యాపిల్ ట్రేడ్-ఇన్ (Trade-in) ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.

యూకే పార్లమెంటు సభ్యులకు (MPs) మెట్ పోలీస్ సమర్పించిన నివేదికలో.. యాపిల్ సంస్థకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR)కు అవకాశం ఉందని తెలిపారు. ట్రేడ్-ఇన్ పరికరాల నెట్‌వర్క్ స్థితిని తనిఖీ చేయడానికి మాత్రమే యాపిల్‌ ప్రతిరోజూ దీన్ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో ఫోన్ల దొంగతనానికి సంబంధించిన అంశాలను తనిఖీ చేయడం లేదని చెప్పారు. అంటే ఎవరైనా ఐఫోన్లు దొంగతనం చేసి ట్రేడ్-ఇన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా క్రెడిట్లు పొంది తిరిగి కొత్త ఫోన్‌ను పొందవచ్చు. లేదా యాపిల్‌ గిఫ్ట్‌ కార్డులు పొందవచ్చు. యాపిల్‌ సరైన తనిఖీలు చేయకుండా దొంగిలించబడిన పరికరాలు మళ్లీ చలామణిలోకి రావడానికి సమర్థవంతంగా అనుమతిస్తుందని పోలీసులు చెబుతున్నారు.

నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR) అనేది దొంగిలించబడిన పరికరాలను గుర్తించడానికి, తిరిగి వాటిని బాధ్యులకు ఇవ్వడానికి చట్ట పరంగా అధికారులు ఉపయోగించే డేటాబేస్. యాపిల్ తన ట్రేడ్-ఇన్ పథకంలో ఈ రిజిస్టర్‌ను ఉపయోగించడం లేదని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.

క్రెడిట్‌ పాయింట్లు

వినియోగదారులు తమ పాత ఐఫోన్‌ను మార్చుకున్నప్పుడు కొత్త ఐఫోన్ కొనుగోలుకు ట్రేడ్‌-ఇన్‌ ప్రోగ్రామ్‌లో ఉదాహరణకు సుమారు 670 యూరోల వరకు క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. సరైన దొంగతనం తనిఖీలు లేకుండా దొంగిలించబడిన ఐఫోన్‌లను ఈ వ్యవస్థలోకి అంగీకరించి తిరిగి విక్రయించడం లేదా పునరుద్ధరిరిస్తున్నట్లు(Refurbished) పోలీసులు చెబుతున్నారు.

పెరిగిన దొంగతనాలు

మెట్ పోలీస్ అందించిన సమాచారం ప్రకారం 2024లోనే లండన్‌లో 80,000 కంటే ఎక్కువ ఫోన్లు దొంగిలించబడ్డాయి. ఇది 2023లో నమోదైన 64,000 దొంగతనాల కంటే పెరిగింది. దొంగిలించబడిన ఈ ఫోన్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలంటే 50 మిలియన్‌ యూరోలు ఖర్చవుతుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఫోన్లలో 75% పైగా విదేశాలకు తరలివెళ్తున్నాయని, అక్కడ వాటిని విడదీసి విడిభాగాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

యాపిల్ ప్రతిస్పందన

మెట్ పోలీస్ విమర్శలను యాపిల్ ఖండించింది. దొంగిలించబడిన డివైజ్‌ల కోసం కంపెనీ Stolen Device Protection వంటి చర్యలు తీసుకుంటుందని హైలైట్ చేసింది. ఫోన్‌ యజమాని ధ్రువీకరణ లేకుండా నేరస్థులు డివైజ్‌లోని డేటాను తొలగించడం లేదా తిరిగి విక్రయించకుండా నిరోధించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: భవిష్యత్తు బంగారు లోహం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement