ఏప్రిల్‌లో ఇంధన అమ్మకాలు పెరగటానికి కారణం ఇదే!

Fuel sales increased 2023 april - Sakshi

7.15 మిలియన్‌ టన్నులకు డీజిల్‌ అమ్మకాలు; 6.7 శాతం అప్‌

న్యూఢిల్లీ: రబీ పంటల కోత పనులు ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వంటి అంశాల దన్నుతో ఏప్రిల్‌లో ఇంధనాలకు డిమాండ్‌ పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే డీజిల్‌ అమ్మకాలు 6.7% పెరిగి 7.15 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. నెలవారీగా చూస్తే మార్చితో పోల్చినప్పుడు 4.8% వృద్ధి నమోదైంది. 

సోమవారం వెలువడిన గణాంకాల ప్రకారం.. పెట్రోల్‌ అమ్మకాలు ఏప్రిల్‌లో వార్షికంగా 2.5% పెరిగి 2.64 మిలియన్‌ టన్నులకు చేరగా, నెలవారీగా మాత్రం స్వల్పంగా 0.5% మేర తగ్గాయి. రబీ పంటల కోతకు ట్రాక్టర్లను ఉపయోగిస్తుండటం వల్ల డీజిల్‌ వినియోగం పెరుగుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top