Covid -19 Lockdown In China: Foxconn Suspends Iphone Factories - Sakshi
Sakshi News home page

China Lockdown: ప్రపంచ దేశాల్లో కరోనా కలవరం, చైనాకు యాపిల్‌ భారీ షాక్‌!

Published Mon, Mar 14 2022 2:56 PM

Foxconn Suspends Iphone Factories In China Due To Cororna - Sakshi

చైనాను కరోనా కొత్త వేరియంట్‌ ప్రపంచ దేశాల్ని కలవరానికి గురి చేస‍్తుంది. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ లాక్‌ డౌన్‌ ప్రకటనతో టెక్‌ దిగ్గజం యాపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. టెక్‌ హబ్‌గా పేరొందిన షెన్‌జెన్‌లో యాపిల్‌ తన ఉత్పత్తి కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  

దక్షిణ చైనాలో షెన్‌జెన్‌ సిటీ టెక్ హబ్‌గా ప్రసిద్ధి చెందింది.  ఇక్కడే యాపిల్‌ సంస్థ చైనా షెన్‌జెన్‌కు చెందిన ఫాక్స్ కాన్తో ఐఫోన్‌కు అవసరమయ్యే విడిభాగాలను తయారు చేస్తుంది. ఆ సంస్థ ఉత్పత్తిలో ఎక్కువ భాగం సెంట్రల్ చైనీస్ నగరం జెంగ్‌జౌలోని ఒక ప్లాంట్‌ నుంచి చేస్తుంది. అయితే తాజాగా కరోనా కేసులు పెరగడంతో ఐఫోన్‌ల తయారీని ఆపేస్తున్నట్లు యాపిల్‌ వెల్లడించింది.

 

వారం రోజులు పాటు లాక్‌ డౌన్‌  
షెన్‌జెన్‌ సిటీలో 17.5 మిలియన్ల మంది ప్రజలు నివాసం ఉంటుంటున్నారు. ఇక్కడ 2020 తరువాత రోజు వారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ కేసులు దాదాపు 3,400కి రెట్టింపు అయిన తర్వాత చైనా ప్రభుత్వం దేశంలోని ప్రధాన నగరాల్లో మూడు సార్లు కరోనా టెస్ట్‌లు నిర్వహించింది. దీంతో జన జీవనం సాధారణంగా కొనసాగితే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భావించారు. అందుకే కరోనాని కట్టడి చేసేందుకు వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ కీలక ప్రకటన చేసింది.

చదవండి: దెబ్బ అదుర్స్‌ కదూ!! చైనాకు చుక్కలు చూపిస‍్తూ..దూసుకెళ్తున్న భారత్‌!

Advertisement

తప్పక చదవండి

Advertisement