China-India: దెబ్బ అదుర్స్‌ కదూ!! చైనాకు చుక్కలు చూపిస‍్తూ..దూసుకెళ్తున్న భారత్‌!

China Ecommerce Revenue Closer To Indian Gdp India Added 150 Million New Users - Sakshi

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వరుస కీలక నిర్ణయాలు భారత్‌కు వరంగా మారుతున్నాయి. మన దేశంలో  చైనా ప్రొడక్ట్‌లపై కేంద్రం నిషేదం విధిస్తున్న విషయం తెలిసిందే. ఆ నిషేధంతో దేశీయ ఉత్పత్తులకు భారీ ఎత్తున డిమాండ్‌ పెరిగి చైనాకు చుక్కలు చూపిస్తుంది. భారత్‌లో ఈ-కామర్స్‌ రంగం నుంచి వచ్చే ఆదాయం చైనాకు తగ్గి.. భారత్‌ ఆదాయం పెరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి.   

డ్రాగన్‌ కంట్రీలో ఈ-కామర్స్‌ రంగం నుంచి వచ్చే ఆదాయం 2.8ట్రిలియన్లు..ఆ ఆదాయం మనదేశ జీడీపీకి సమానంగా ఉంది. అయితే కేంద్రం చైనా ఉత్పత్తుల్ని బ్యాన్‌ చేయడంతో భారత్‌లో ఈకామర్స్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. చైనా ఆదాయానికి పోటాపోటీగా దేశీయంగా ఈకామర్స్‌ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలో ఈకామర్స్‌ ను ఉపయోగించే జాబితాలో 150మిలియన్ల మంది కొత్త వినియోగదారులు వచ్చి చేరారు.

ఈ సందర్భంగా.."చైనా ఇ-కామర్స్ ఆదాయాలు ఒక సంవత్సరంలో 2.8ట్రిలియన్ల అమ్మకాలు జరపడం ద్వారా చైనా ప్రపంచంలోని మిగిలిన దేశాల కంటే ముందంజలో ఉంది. ఇదే సమయంలో భారత్‌లో ఈకామర్స్‌ రంగం ఊపందుకోవడం సంతోషకరమైన విషయమేనని సిఐఐ నిర్వహించిన ఈకామర్స్ కాన్‌క్లేవ్‌లో వెస్ట్‌ బెంగాల్ ప్రభుత్వ ఐటీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ కుమార్ అన్నారు.

ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాంకర్ చక్రవర్తి మాట్లాడుతూ..గత నెలలో 150మిలియన్ల మంది వినియోగదారులు ఈకామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించుకున్నారు. 50శాతం ఇంటర్నెట్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం ప్రారంభించారు. ఆన్‌లైన్‌పై అవగాహన పెరడగంతో ఈ కామర్స్ సంస్థలలో పెట్టుబడులు పెరిగాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  

ఈ కామర్స్ కంటెంట్, వాణిజ్య పరంగా, ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ పరంగా మార్కెట్ ఇంటిగ్రేషన్‌ను తీసుకువచ్చిందని టాటా క్లిక్ బ్యూటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ధర్మరాజన్ చెప్పారు. మాల్స్‌లో డిజిటల్ అడాప్టేషన్ భారీగా ఉంది. మాల్స్‌లో కూడా 50శాతం మంది కస్టమర్‌లు డిజిటల్ అడాప్టేషన్‌ల ద్వారా వెళ్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లను జోడించడం ఒకదానికొకటి అనుబంధంగా మారిందని బెనర్జీ చెప్పారు. తద్వారా భారత్‌లో ఈకామర్స్‌ రంగం మరింత వృద్ది సాధించేందుకు తోడ్పడుతుందని తెలిపారు.

చదవండి: ముఖేష్‌ అంబానీ ముందు చూపు.. సన్మీనాలో వందల కోట్ల పెట్టుబడులు!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top