సావరీన్‌ గ్రీన్‌ బాండ్ల జారీకి ఫ్రేమ్‌వర్క్‌ | FM Nirmala Sitharaman approves India first sovereign green bonds framework | Sakshi
Sakshi News home page

సావరీన్‌ గ్రీన్‌ బాండ్ల జారీకి ఫ్రేమ్‌వర్క్‌

Nov 10 2022 4:35 AM | Updated on Nov 10 2022 4:35 AM

FM Nirmala Sitharaman approves India first sovereign green bonds framework - Sakshi

న్యూఢిల్లీ:  ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సావరీన్‌ గ్రీన్‌ బాండ్లను జారీ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (2022–23 అక్టోబర్‌–మార్చి)  గ్రీన్‌ బాండ్ల జారీ ద్వారా రూ.16,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం కేంద్ర రుణ సమీకరణలో (రూ.5.92 లక్షల కోట్లు) ఈ నిధులు భాగం కానున్నాయి.  

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2022–23 బడ్జెట్‌లో సావరీన్‌ గ్రీన్‌ బాండ్ల జారీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ప్యారిస్‌ ఒప్పందం లక్ష్యాలపై భారత్‌ నిబద్ధతను ఈ ఫ్రేమ్‌వర్క్‌ బలోపేతం చేస్తుందని అన్నారు. అలాగే అర్హతగల గ్రీన్‌ ప్రాజెక్ట్‌ల్లోకి  ప్రపంచ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు.  

ఫ్రేమ్‌వర్క్‌లో ముఖ్యాంశాలు...
► గ్రీన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ల అవసరాలకు అనుగుణంగా, ఎకానమీలో కార్బన్‌ తీవ్రత తగ్గింపు లక్ష్యంగా జారీఅయ్యే ఈ రూపాయి డినామినేటెడ్‌ బాండ్ల  సుదీర్ఘ కాల వ్యవధిని కలిగి ఉంటాయి.
► గ్రీన్‌ బాండ్‌ల జారీకి గరిష్టంగా 12 నెలల ముందు జరిగిన ప్రభుత్వ వ్యయాలకు ఈ సమీకరణ నిధులు పరిమితమవుతాయి. అలాగే జారీ చేసిన 24 నెలల్లోపు మొత్తం ఆదాయాన్ని ప్రాజెక్టులకు కేటాయించేలా కృషి జరగనుంది.  
► గ్రీన్‌ బాండ్ల జారీ ద్వారా వచ్చే ఆదాయాన్ని శిలాజ ఇంధనాల వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ లేదా అణు విద్యుత్‌ ప్రాజెక్టులకు వినియోగించరాదు.  
► అర్హత కలిగిన పెట్టుబడులు, సబ్సిడీలు, గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్స్‌ లేదా పన్ను మినహాయింపులు లేదా ఎంపిక చేసిన కార్యాచరణ ఖర్చుల రూపంలో గ్రీన్‌ బాండ్ల  ప్రభుత్వ వ్యయాలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement