మౌలిక రంగంపై మరింత దృష్టి | Sakshi
Sakshi News home page

మౌలిక రంగంపై మరింత దృష్టి

Published Sat, Feb 19 2022 5:40 AM

FM calls for bridging global infrastructure funding gap - Sakshi

న్యూఢిల్లీ: మౌలిక రంగం పురోగతిపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. ఈ రంగానికి సంబంధించి నిధులను సమకూర్చడం, రుణ యంత్రాగాల ఏర్పాటు వంటి అంశాలపై కలిసికట్టుగా ముందుకు నడవాలని ఇండోనేసియా అధ్యక్షతన జరుగుతున్న జీ–20 ఆర్థికమంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల రెండవరోజు వర్చువల్‌ సమావేశంలో ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మౌలిక రంగంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొని ఆర్థికమంత్రి ప్రసంగించినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్‌ పేర్కొంది. ఇండోనేషియాలోని జకార్తాలో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ల  సమావేశం శుక్రవారం కరోనాసవాళ్లను ఎదుర్కొనడం, మౌలిక రంగంలో పెట్టుబడులుసహా పలు కీలక అంశాలపై చర్చించింది.

Advertisement
Advertisement