Flipkart Big Discount: Vivo T1x Smartphone Bonanza Sale, Just Rs 999 - Sakshi
Sakshi News home page

బంపరాఫర్‌, ఇలా చేస్తే.. రూ. 999కే అదిరిపోయే ఫీచర్లున్న వివో స్మార్ట్‌ఫోన్‌ మీ సొంతం!

Nov 13 2022 6:58 PM | Updated on Nov 13 2022 8:03 PM

Flipkart Big Discount: Vivo T1x Smartphone Bonanza Sale, Just Rs 999 - Sakshi

వివో (Vivo) కొన్ని నెలల క్రితం మార్కెట్లో కస్టమర్ల బడ్జెట్‌కు అనుగుణంగా వివో టీ1 ఎక్స్‌( Vivo T1X) లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇది యూజర్లకు మంచి గేమింగ్ ఎక్సపీరియన్స్‌ కోసం ప్రత్యేకంగా తయారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్ల బొనాంజా సేల్‌ నడుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌కు సంబంధించి అదిరిపోయే ఆఫర్‌ని ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌. కేవలం రూ.999 ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అదెలా అనుకుంటున్నారా, దానిపై ఓ లుక్కేద్దాం!

Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లో మూడు వేరియంట్లతో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం అవి ఫ్లిప్‌కార్ట్‌( Flipkart)లో.. 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ.16,999గా ఉండగా, 4GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ రూ.17,990, ఉంది. వీటితో పాటు 6GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన దాని టాప్ వేరియంట్ ఫోన్ ధర రూ.18,990గా ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్‌లతో అందిస్తోంది. ఇవి గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్‌లతో లభ్యమవుతుంది.

చదవండి: సామాన్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు!

కేవలం.. రూ.999లకే ఈ ఫోన్‌ మీ జేబులోకి
ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్ల బొనాంజా సేల్‌లో, ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సెల్‌లో, మీరు 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ని కేవలం రూ. 999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలా అంటే .. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 18,990గా ఉంది. ఇందులో 21 శాతం తగ్గింపు ఆఫర్‌తో వస్తోంది. అంటే ఈ ఫోన్‌ని రూ.14,999కే వస్తుంది.

దీంతో పాటు, మీరు ఈ సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయండోయ్‌.  కంపెనీ దీనిపై రూ.14,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కనుక కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వనియోగం చేసుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 999కు మీ సొంతం చేసుకుని జేబులో పెట్టుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ బెనిఫిట్‌ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ పని చేస్తున్న కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.

చదవండి: ఆ కంపెనీ భారీ ప్లాన్‌.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట!

Advertisement
 
Advertisement
Advertisement