Mobile Game: జస్ట్‌ ఒక్క మొబైల్‌ గేమ్‌తో 75 వేల కోట్లు సొంతం...!

The First Mobile Game Ever To Earn 10 Million Dollars Revenue - Sakshi

టెన్సెంట్, టీఐఎంఐ స్టూడియోస్ సంయుక్తంగా రూపోందించిన 'హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌’ మొబైల్‌ గేమ్స్‌ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఈ గేమ్‌ ఆదాయం సుమారు 10 బిలియన్‌ డాలర్లకు చేరుకున్న తొలి మొబైల్‌ గేమ్‌గా హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌ నిలిచింది.  హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌ గేమ్‌ను చైనా రూపొందించింది. ఈ గేమ్‌ కేవలం చైనాలో అందుబాటులో   ఉండగా...మిగతా దేశాల గేమింగ్‌ ప్రియులకు ‘ఆరేనా ఆఫ్‌ వాలర్‌’ గేమ్‌గా అందుబాటులో ఉంది.
చదవండి:  ట్విటర్‌లో యూజర్ల గోలాగోలా..! ఇవి చూస్తే నవ్వలేక చచ్చిపోవాల్సిందే..!

హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌ గేమ్‌ చైనాలో అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా గేమింగ్‌ మార్కెట్‌లో చైనా గణనీయమైన అభివృద్దిని సాధించింది.2021లో హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌  ఇప్పటివరకు సగటు రెవెన్యూ 14 శాతం మేర పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మల్టీప్లేయర్‌ ఆన్‌లైన్‌ బాటిల్‌ అరేనా గేమ్స్‌ విభాగంలో భారీగా పురోగతి కన్పిస్తోంది. కరోనా రాకతో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆడే వారి సంఖ్య భారీగా పెరిగింది.  గేమింగ్‌ ప్రియులు ఆయా ఆన్‌లైన్‌ గేమింగ్‌లో డబ్బులను వెచ్చించడంతో వెనుకాడడం లేదు.

సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం... ఈ ఏడాదిలో హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌ గేమ్‌ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్స్‌ సహాయంతో సుమారు రెండు బిలియన్‌ డాలర్లకు పైగా సంపాదించిన్నట్లు వెల్లడించింది. ఒకానొక సమయంలో ఐఫోన్‌ యూజర్ల  నుంచి 717 మిలియన్‌డాలర్లను కేవలం  3 నెలల్లోనే ఆర్జించింది. అత్యధికంగా గడించిన గేమింగ్‌ యాప్స్‌లో వరుసగా పబ్జీ మొబైల్‌, జెన్‌షిన్‌ ఇంపాక్ట్‌, రోబ్లోక్స్‌, త్రీ కింగ్‌డమ్‌ టాక్టిక్స్‌ నిలిచాయి  
చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. హ్యాకింగ్‌ కాదు జరిగింది ఇది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top