రూపాయిపై బ్యాంకర్లతో నేడు ఆర్థిక శాఖ భేటీ | FinMin to hold meeting with stakeholders to push overseas trade in rupee | Sakshi
Sakshi News home page

రూపాయిపై బ్యాంకర్లతో నేడు ఆర్థిక శాఖ భేటీ

Sep 7 2022 10:38 AM | Updated on Sep 7 2022 10:39 AM

FinMin to hold meeting with stakeholders to push overseas trade in rupee - Sakshi

న్యూఢిల్లీ: డాలరు స్థానంలో రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు సంబంధిత వర్గాలతో కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం (నేడు) సమావేశం కానుంది. విదేశీ వ్యవహారాల శాఖ, వాణిజ్య శాఖ, ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌ వర్గాలు ఇందులో పాల్గోనున్నాయి.

ఈ సమావేశానికి ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా సారథ్యం వహిస్తారు. ఎగుమతిదారులు వీలైనంత వరకూ రూపాయి మారకంలో వాణిజ్యం జరిపేలా చూడటంపై దృష్టి పెట్టాలంటూ బ్యాంకులకు ఈ భేటీలో సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం రష్యాతో భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్యంలో సింహభాగం రూపాయి మారకంలోనే సెటిల్‌ అవుతోంది.    

Advertisement
 
Advertisement
Advertisement