ఐటీ పోర్టల్‌ లోపాలు.. ఇన్ఫోసిస్‌పై కేంద్రం గరం

Finance ministry summons Infosys CEO Salil Parekh - Sakshi

రెండు రోజులుగా అందుబాటులోనే లేని వెబ్‌సైట్‌

నిర్వహణ పనుల కోసం నిలిపివేసినట్లు ఇన్ఫీ వెల్లడి

వివరణ ఇవ్వాలంటూ ఇన్ఫోసిస్‌

సీఈవోకు ఆర్థిక శాఖ ఆదేశాలు

Glitches in New I-T Portal: న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్‌ను సాంకేతిక లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా పోర్టల్‌ పూర్తిగా అందుబాటులోనే లేకుండా పోవడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రారంభించి రెండున్నర నెలలు అవుతున్నా ఇలా సమస్యలు కొనసాగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సోమవారం వచ్చి వివరణ ఇవ్వాలంటూ పోర్టల్‌ను రూపొందించిన టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈవో సలిల్‌ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. చదవండి: లోకేశ్‌ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష

‘కొత్త ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించి 2.5 నెలలు అయిపోతున్నప్పటికీ పోర్టల్‌లో సమస్యలను ఇంకా ఎందుకు పరిష్కరించలేదనే అంశంపై ఆగస్టు 23న (సోమవారం) కేంద్ర ఆర్థిక మంత్రికి వివరణ ఇవ్వాలని ఇన్ఫోసిస్‌ సీఈవో సలిల్‌ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఆగస్టు 21 నుంచి ఏకంగా పోర్టల్‌ అందుబాటులోనే లేదు‘ అని ఆదాయ పన్ను శాఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేసింది. మరోవైపు, నిర్వహణ పనుల కోసం ట్యాక్స్‌ పోర్టల్‌ అందుబాటులో ఉండదని ట్విటర్‌లో శనివారం ఇన్ఫోసిస్‌ ట్వీట్‌ చేసింది. అత్యవసర మెయింటెనెన్స్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తయ్యాక అప్‌డేట్‌ చేస్తామంటూ ఆదివారం మరో ట్వీట్‌ చేసింది.  

అప్పుడు జీఎస్‌టీ, ఇప్పుడు ఐటీ..
అటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐఅండ్‌బీ) కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ‘ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫోసిస్‌ గందరగోళం చేసిన రెండో ప్రాజెక్టు ఇది. మొదటిది జీఎస్‌టీ పోర్టల్‌ కాగా ఇప్పుడు ఇన్‌కం ట్యాక్స్‌ పోర్టల్‌. రెండు వరుస వైఫల్యాలనేవి కాకతాళీయంగా అనుకోవడానికి లేదు. దీనితో కంపెనీకి సామర్థ్యాలైనా లేకపోవచ్చు లేదా పనిని సజావుగా పూర్తి చేసి ఇచ్చే ఉద్దేశమైనా లేకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది‘ అని ఐటీ శాఖ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఐఅండ్‌బీ శాఖ సీనియర్‌ సలహాదారు కంచన్‌ గుప్తా ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.  చదవండి: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

వివరాలు ఇలా..
రిటర్నుల ప్రాసెసింగ్‌ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించడం, రిఫండ్‌ల వేగవంతం లక్ష్యంగా కొత్త ఐటీ పోర్టల్‌ అభివృద్ధికి  రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. జూన్‌ వరకూ రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్‌టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ప్రా జెక్టు నిధుల  మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్‌ 7న పోర్టల్‌ను ప్రభు త్వం ప్రారంభించింది. అయితే, అప్పట్నుంచీ వెబ్‌సైటును సాంకేతిక లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top