
ఈపీఎఫ్ (EPF) విత్‌డ్రా ఇక మరింత సులువు కానుంది. పీఎఫ్ మొత్తాన్ని నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులకు వాడుకునే వెసులుబాటు రానుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) రాబోయే మూడు నెలల్లో ఈపీఎఫ్ క్లెయిమ్‌ల కోసం యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత ఉపసంహరణలను ప్రవేశపెట్టనుంది .
ఈపీఎఫ్ విత్‌డ్రా (EPF Withdrawal) ప్రక్రియను మరింత సులువుగా మార్చడమే లక్ష్యంగా ఈపీఎఫ్‌వో ఈ వెసులుబాటు తీసుకొస్తోంది. దీని ద్వారా దాని లక్షల మంది చందాదారులకు ఈపీఎఫ్ ఉపసంహరణ వేగవంతంగా మరింత అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఈపీఎఫ్‌ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసి యూపీఐ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫీచర్‌ను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇది చదివారా? త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్‌తో..
ఒకసారి ఇంటిగ్రేట్ ప్రక్రియ పూర్తయి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే క్లెయిమ్ మొత్తాలను సబ్‌స్క్రైబర్లు డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఉపసంహరణలను సులభతరం చేయడానికి, జాప్యాలను నివారించడానికి, కాగితపు పనిని తగ్గించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్‌వో డిజిటల్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోంది.
పెన్షన్ సేవలను మెరుగుపరచడం, ప్రావిడెంట్ ఫండ్ ( PF ) క్లెయిమ్‌ల కోసం క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను సులభతరం చేయడం లక్ష్యంగా ఇప్పటికే ఈపీఎఫ్‌వో అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. అందులో భాగమే ఈ చొరవ. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌లో 5 కోట్లకు పైగా చందాదారుల క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసి, రూ . 2.05 లక్షల కోట్లకు పైగా సొమ్మును పంపిణీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment