ElonMusk క్షణం తీరికలేని పని: కొత్త ఫీచర్‌ ప్రకటించిన మస్క్‌

Elon Musk says I Have Too Much Work On My Plate and announces new feature - Sakshi

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్‌ సైట్‌  ట్విటర్‌ టేకోవర్‌ తరువాత అనూహ్య సంస్కరణలు చేపడుతున్న ట్విటర్‌ కొత్త బాస్‌ బిలియనీర్ ఎలాన్‌ మస్క్‌ మరో సరికొత్త అంశాన్ని ప్రకటించారు. ఇకపై తమ ప్లాట్‌ఫాంలో ఆయా సంస్థలను సర్టిఫై చేస్తుందని  మస్క్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మస్క్‌ కొత్త ఫీచర్‌ను ప్రకటించారు. 

ట్విటర్‌ ద్వారా కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్న ప్రకటించిన మస్క్‌ ఏయే ట్విటర్‌ అకౌంట్స్‌, ఏ యే సంస్థలకు అనుసంధానంగా ఉన్నాయో గుర్తించేందుకు ఆయా సంస్థలను అనుమతి నిస్తుందని ఆదివారం ట్వీట్‌ చేశారు. ఈ ఫీచర్‌ త్వరలోనే లాంచ్‌ చేస్తామన్నారు. దీనిపై ఒక యూజర్‌ స్పందిస్తూ.. అంటే ఏ ఖాతాదారుడు ఏ ఆర్గనైజేషన్‌కు చెందినవాడో ట్విటర్‌ డిసైడ్‌ చేస్తుందన్నమాట అని ప్రశ్నించారు. కచ్చితంగా.. ట్విటరే తుది మధ్యవర్తిగా ఉంటుంది... అంతకుమించి వేరే మార్గం లేదు అంటూనే సూచనలు సలహాలను ఆహ్వానిస్తున్నాని పేర్కొన్నారు. 

అలాగే ఇటీవల ట్విటర్‌ను సొంతం చేసుకోవడం, అటు ఆటోమేకర్ టెస్లా చీఫ్‌గా ఇలా రెండు సంస్థలకు సీఈవోగా ఉంటున్న క్రమంలో దీని ప్రభావం టెస్లాపై పడనుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఉదయం నుండి రాత్రి వరకు, వారంలో ఏడు రోజులూ  క్షణం తీరికలేకుండా, ఎడ తెగకుండా పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

అయితే 44 బిలియన్‌ డాలర్ల  ట్విటర్‌  కొనుగోలు డీల్‌ పూర్తి చేసిన  టెస్లా సీఈవో  ఎలాన్‌మస్క్‌ వెను వెంటనే పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు, బోర్డు రద్దు, కంపెనీలో సగానికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన, బ్లూటిక్ వెరిఫికేషన్‌ ఫీజు లాంటి చర్యలను ప్రకటించారు. బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజుపై వెనక్కి తగ్గిన మస్క్‌ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ వచ్చే వారం నుంచి బహుశా తీసుకురావచ్చునని ట్వీట్‌ చేసిన పూర్తిఫీజు ఎంత నిర్ణయించిందీ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే అధికారిక హ్యాండిల్స్‌ను ఎలా గుర్తించేది వెల్లడించలేదు. మరోవైపు కొన్ని దేశాల్లో ట్విటర్‌ స్లోగా ఉండటంపై  మస్క్‌ క్షమాపణలు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top