Elon Musk: ట్విటర్‌ గుర్రు: పగలబడి నవ్వుతున్న మస్క్‌

Elon Musk mocks Twitter as it mulls suing him - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ డీల్‌ ప్రకటించినప్పటి నుంచి రోజుకో  కొత్త పరిణామం వెలుగులోకి వస్తుంది. 44 బిలియన్ల డాలర్లతో ట్విటర్‌ను  సొంతం చేసుకోవాలనుకున్న మస్క్‌  ఆ తరువాత, ఆ డీల్‌ను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు ప్రకటించారు. నకిలీ ఖాతాల సమాచారాన్ని అందించడంలో ట్విటర్‌ వైఫల్యం నేపథ్యంలో కొనుగోలు  విరమించుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించారు.  

ట్విటర్‌ డీల్‌ రద్దుపై ట్విటర్‌ దావా వేయనుందన్న వార్తలపై తాజాగా  మస్క్‌  స్పందించారు. వరుస ట్వీట్స్‌తో ట్విటర్‌పై సెటైర్లు వేశారు. మొదట నేను అసలు ట్విటర్‌ను కొనుగోలు చేయలేను అన్నారు. డీల్‌ ప్రకటించిన తరువాత నకిలీ ఖాతాల సమాచారాన్ని వెల్లడించలేదు. ఇపుడు ట్విటర్‌ను కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారంటూ ఎగతాళిగా కమెంట్‌ చేశారు. అంతేకాదు ఇపుడిక వారు కోర్టులో నకిలీ ఖాతాల   సమాచారాన్ని బహిర్గతం చేయాలంటూ  ట్వీట్‌ చేశారు.

కాగా మల్టీ బిలియన్‌ డాలర్ల ట్విటర్‌  డీల్‌ రద్దు చేసుకున్న బిలియనీర్‌పై  దావా వేసేందుకు ట్విటర్‌ ప్రముఖ  లా ఏజెన్సీతో సంప్రదింపులు చేస్తోంది.  అమెరికా ఆధారిత న్యాయ సంస్థ వాచెల్, లిప్టన్, రోసెన్  కాట్జ్ ఎల్‌ఎల్‌పీని  ఇందుకోసం నియమించుకుంది. ఈ వారం ప్రారంభంలో డెలావేర్‌లో పిటిషన్‌ దాఖలు చేయనుందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. మరోవైపు ఇదే ఏజెన్సీ 2018లో టెస్లాను తీసుకోవాలనే మస్క్‌కు సలహాదారుగా ఉండటం విశేషం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top