EGO 56V 18-Inch Battery-Powered Misting Fan Built By EgoPowerPlus - Sakshi
Sakshi News home page

EGO 56V Misting Fan: ఎవరైనా వావ్ అనాల్సిందే, ఏసీకి దీటైన ఫ్యాను..ధర ఇంత తక్కువా!

Apr 10 2022 10:27 AM | Updated on Apr 12 2022 9:07 AM

Ego 56v 18 Inch Battery Powered Misting Fan - Sakshi

ఇందులోని మిస్టింగ్‌ ఫంక్షన్‌ పనిచేయడానికి, ఫ్యాన్‌కు అనుబంధంగా ఉన్న సిలిండర్‌లో ఒక బకెట్‌ నీళ్లు పోసుకుంటే చాలు. దీని స్పీడ్‌ను ఐదు రకాలుగా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. 

గదిలో ఈ ఫ్యాను ఉంటే చాలు, ఇక ఏసీ అవసరమే ఉండదు. వేసవిని చల్లగా ఆస్వాదించవచ్చు. అమెరికన్‌ కంపెనీ ‘ఇగో పవర్‌ ప్లస్‌’ రూపొందించిన ‘మిస్టింగ్‌ ఫ్యాన్‌’ ఇది. దీని పనితీరు దాదాపు ఎయిర్‌ కూలర్‌ మాదిరిగా ఉన్నా, ఇది ఎయిర్‌ కండిషనర్‌ కంటే సమర్థంగా పనిచేస్తుంది. 

ఇందులోని మిస్టింగ్‌ ఫంక్షన్‌ పనిచేయడానికి, ఫ్యాన్‌కు అనుబంధంగా ఉన్న సిలిండర్‌లో ఒక బకెట్‌ నీళ్లు పోసుకుంటే చాలు. దీని స్పీడ్‌ను ఐదు రకాలుగా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. కనిష్ఠంగా 1500 సీఎఫ్‌ఎం నుంచి గరిష్ఠంగా 5000 సీఎఫ్‌ఎం (క్యూబిక్‌ ఫీట్‌ పర్‌ మినిట్‌) వరకు గది విస్తీర్ణాన్ని బట్టి దీని వేగాన్ని నియంత్రించుకోవచ్చు. 

గది ఉష్ణోగ్రతను ఇది ఏకంగా 20 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గించగలదు. దీని ధర దాదాపు 250 డాలర్లు (రూ.19 వేలు) మాత్రమే. సాధారణ ఫ్యానుకయ్యే విద్యుత్తు ఖర్చే దీనికీ అవుతుంది. ఏసీ మాదిరిగా భారీ బిల్లులు వస్తాయనే భయమే అక్కర్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement