ఆస్ట్రేలియా సంస్థను టేకోవర్‌ చేసిన ఇండియన్‌ కంపెనీ

EdTech Company UpGrade Take over Australian Global Study Partner - Sakshi

అప్‌గ్రాడ్‌ చేతికి ఆస్ట్రేలియా సంస్థ 

డీల్‌ విలువ 16 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు   

ముంబై: ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ (ఎడ్‌టెక్‌) కంపెనీ అప్‌గ్రాడ్‌ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన గ్లోబల్‌ స్టడీ పార్ట్‌నర్స్‌ (జీఎస్‌పీ)ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ డీల్‌ విలువ 16 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లుగా ఉంటుందని (సుమారు రూ. 85 కోట్లు), మరో 10 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 53.5 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నామని వివరించింది. 2015లో ఏర్పాటైన జీఎస్‌పీకి ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, అమెరికాలో దాదాపు 600 పైగా కేంద్రాల నెట్‌వర్క్‌ ఉంది. 1,300 మంది రిక్రూట్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌ ఉన్నారు.

ఇదే ప్రథమం
ఒక అంతర్జాతీయ సంస్థను అప్‌గ్రేడ్‌ కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. సమగ్ర ఎడ్‌టెక్‌ దిగ్గజం గా 18–50 ఏళ్ల మధ్య వయస్సు గల వారి అభ్యాసకుల విద్యావసరాలను తీరుస్తున్నామని, విదేశాలకూ కార్యకలాపాలను విస్తరించడానికి జీఎస్‌పీ కొనుగోలు తోడ్పడగలదని అప్‌గ్రేడ్‌ వ్యవస్థాపకుడు చైర్మన్‌ రోనీ స్క్రూవాలా తెలిపారు. విదేశాల్లో విద్యాభ్యాసానికి సంబంధించిన సర్వీసులు అందించే విభాగం ద్వారా వచ్చే మూడేళ్లలో 100 మిలియన్‌ డాలర్ల ఆదాయం అంచనా వేస్తున్నట్లు అప్‌గ్రేడ్‌ ప్రెసిడెంట్‌ గౌరవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

చదవండి: అప్‌గ్రేడ్‌ సంస్థకు యూనికార్న్‌ హోదా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top