దాతృత్వంలో దేశంలోనే అజీమ్‌ ప్రేమ్‌జీ టాప్‌

EdelGive Hurun India Philanthropy List 2021, Azim Premji Donated RS 27 Crore Per Day - Sakshi

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ దాన, ధర్మాల్లో ఎప్పుడూ ముందుంటారు. 2020-2021 ఆర్ధిక సంవత్సరంలో విరివిగా దానాలు చేసి అగ్రస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2021 ప్రకారం రోజుకు సగటున రూ.27 కోట్లతో ఏడాదికి రూ.9,713 కోట్లు చొప్పున విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం దాతృత్వంతో హురున్‌ ఇండియా, ఎడెల్‌గైవ్‌ ఇండియా దాతృత్వ జాబితా- 2021లో అజీమ్‌ ప్రేమ్‌జీ ముందు వరుసలో నిలిచారు. ప్రేమ్ జీ తన విరాళాలను గత ఏడాదితో పోలిస్తే 23 శాతం వరకు పెంచారు. అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఈ మహమ్మారి అరికట్టడం కోసం విరాళాలను రెట్టింపు చేసింది

హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ శివ్‌నాడార్‌ ₹1,263 కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ₹577 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. తర్వాత వరుస స్థానాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా ₹377 కోట్ల సహకారంతో జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఈ ఏడాది జాబితాలో ₹183 కోట్ల విలువైన మొత్తం విరాళాలతో ఐదవ స్థానానికి చేరుకున్నారు. ఇక హిందూజా కుటుంబం ₹166 కోట్ల విరాళాలతో జాబితాలో ఆరవ స్థానంలో నిలిచారు. ₹50 కోట్ల విరాళంతో మొదటిసారి ఇన్వెస్టర్ రాకేష్ ఝుంఝున్ వాలా ఈ దాతృత్వ జాబితాలోకి ప్రవేశించారు. 

(చదవండి: బంపర్‌ ఆఫర్‌..! రూ.101కే వివో ఫోన్..షరతులు వర్తిస్తాయి..!)

వాతావరణ మార్పుల పరిష్కారాల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు మద్దతు తెలపడానికి సిరోధా సహ వ్యవస్థాపకులు నిథిన్ & నిఖిల్ కామత్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ₹750 కోట్లు ఇవ్వనున్నారు. ఈ జాబితాలో 35వ స్థానంలో ఉన్నారు. 35 ఏళ్ల నిఖిల్ నిఖిల్ కామత్ ఈ జాబితాలో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో ఈ ఏడాది తొమ్మిది మంది మహిళలు పాల్గొన్నారు. రోహిణి నీలేకని దాతృత్వాల కోసం ₹ 69 కోట్లు విరాళం ఇచ్చారు. 

(చదవండి: ఎలక్ట్రిక్‌ కార్లపై దృష్టిసారించిన ఉబర్‌..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top