ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన అంబులెన్స్ ఇదే!! 2.8సెక‌న్ల‌లో 100కిలోమీట‌ర్ల వేగంతో

Dubai Ambulance Is The Worlds Fastest One And It Costs Rs 26 Crore - Sakshi

దుబాయ్ రోడ్ల‌లో ఇక‌పై ప్ర‌పంచంలోనో అత్యంత ఖ‌రీదైన లైకాన్ హైప‌ర్ స్పోర్ట్స్ అంబులెన్స్‌లు దూసుకెళ్ల‌నున్నాయి. ఇటీవ‌ల దుబాయ్ కార్పొరేషన్ ఆఫ్ అంబులెన్స్ సర్వీసెస్ ఇటీవల దుబాయ్ ఎక్స్‌పోలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌, ఖరీదైన అంబులెన్స్‌ను ప్ర‌ద‌ర్శించింది.ఈ అంబులెన్స్ కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ల‌నుంది. గరిష్టంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంద‌ని  నిర్వాహ‌కులు తెలిపారు. 


 
దుబాయ్‌కి చెందిన డబ్ల్యూ మోటార్స్ ప్ర‌పంచంలోనే ఫాస్టెస్ట్ ఏడ‌వ లైకాన్ హైప‌ర్ స్పోర్ట్స్ కారును త‌యారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా లైకాన్ హైపర్‌స్పోర్ట్ కారు 6యూనిట్లు మాత్ర‌మే ఉండ‌గా.. డ‌బ్ల్యూ మోటార్స్ 7వ కారును త‌యారు చేసింది. ఇక దీని ధ‌ర అక్ష‌రాల‌ రూ.26కోట్లు.  

ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. 
ఈ కారును 440 వజ్రాల సెట్తో డిజైన్ చేశారు. కారు లోపలి టాప్ భాగం బంగారు పూత మ‌న‌కు ద‌ర్శ‌నమిస్తుంది. లైకాన్ హైపర్‌స్పోర్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ హోలోగ్రాఫిక్, హోలోగ్రాఫిక్ మిడ్-ఎయిర్ డిస్‌ప్లేతో వస్తుంది. డ్రైవ‌ర్ ఇచ్చే సిగ్న‌ల్స్ ఆధారంగా ప‌నిచేస్తుంది. కారు మొత్తం బరువును తగ్గించడానికి పూర్తిగా కార్బన్ ఫైబర్ను ఉప‌యోగించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top