ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు మళ్లీ షాక్! | Domestic LPG Cylinder Price Hiked by RS 25 | Sakshi
Sakshi News home page

ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు మళ్లీ షాక్!

Aug 17 2021 8:17 PM | Updated on Aug 17 2021 10:36 PM

Domestic LPG Cylinder Price Hiked by RS 25 - Sakshi

పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. సబ్సిడీ లేని సిలిండర్ ధరను రూ.25పైగా పెంచడంతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ఇప్పుడు రూ.859.5కు చేరుకుంది. ఇంతకు ముందు ఇది రూ.834.50గా ఉండేది. అంతకు ముందు జూలై 1న ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.25.50 పెంచిన సంగతి తెలిసిందే. ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ రేటు ఇప్పుడు రూ.859.5 గా ఉంది. కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.861 నుంచి రూ.886కు పెరిగింది.

ఈ రోజు నుంచి చెన్నైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర  రూ.850.50 నుంచి రూ.875.50కు పెరిగింది. హైదరాబాద్‌లో రూ.887లుగా ఉన్న గ్యాస్ ధర రూ.25 పెరిగి రూ.912కి చేరింది. సాధారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్ల(ఎల్‌పీజీ ధర) ధరలను మారుస్తాయి. 2021 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.694గా ఉంటే ప్రస్తుతం ఢిల్లీలో దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.859.5కు పెరిగింది. అంటే ఏడాదిలో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు రూ.165.50 పెరిగాయి. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement