మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ ​కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్‌

Do you Know Many Banks offers free accident Life Insurance with debit cards - Sakshi

సాక్షి,ముంబై: దేశీయంగా ప్రధాన బ్యాంకులు తమ డెబిట్‌కార్డులపై వినియోగదారులకు ఉచిత ప్రమాద బీమా,  లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తాయి. అలాగే పోయిన సామాన్లు, లావాదేవీలకు రక్షణ కల్పిస్తాయి. డెబిట్ కార్డులతో, మెజారిటీ బ్యాంకులు కాంప్లిమెంటరీ బీమా కవరేజీని అందిస్తాయి. డెబిట్ కార్డులకు ఉచిత బీమా ఉంటుంది. వాస్తవానికి ఈ విషయం చాలామంది కస్టమర్లకు తెలియదు. ప్రభుత్వరంగ  దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తోపాటు,  కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ అందించే కవరేజ్‌ని ఒకసారి చూద్దాం. (కేజీఎఫ్‌ లాంటి సూపర్‌ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!)

కోటక్ మహీంద్రా బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద మరణ ప్రయోజనాన్ని రూ. 25 లక్షల వరకు అందిస్తుంది. బీమా కవరేజీని యాక్టివేట్ చేయడానికి, ఏటీఎం లావాదేవీ, పాయింట్-ఆఫ్-సేల్ లావాదేవీ లేదా ఆన్‌లైన్ కొనుగోలు లాంటి విషయాల్లో ఘటనకు, లేదా ప్రమాద తేదీకి 90 రోజుల ముందు కనీసం ఒక్క సారైనా కార్డ్‌ని ఉపయోగించి ఉండాలి. అంతేకాకుండా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీని అందజేస్తుంది. దీని రూ. 6 లక్షల వరకు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన కార్డ్‌లతో మర్చంట్, ఆన్‌లైన్ పోర్టల్‌లలో చేసిన కొనుగోళ్లకు రక్షణ కల్పిస్తుంది. (మ్యూచువల్ ఫండ్స్‌ పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్‌: నామినీ నమోదు ఎలా?)

ఎస్‌బీఐ
ఎయిర్‌లైన్ అందించే కవరేజీకి అదనంగా, ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి విభిన్న విమానయాన ప్రమాద మరణ బీమాను అందిస్తుంది. స్థానిక, అంతర్జాతీయ విమానాలకు బ్యాగేజ్ నష్ట బీమాను కూడా అందిస్తుంది. అయితే ఎయిర్‌లైన్ టిక్కెట్‌ను కొనుగోలుకు బ్యాంకు డెబిట్ కార్డ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అదీ ప్రమాదం జరిగిన 90 రోజులలోపు ఉపయోగించాలి. అలా చేయడంలో విఫలమైతే బీమా ప్రయోజనం ఉండదు.  ఒక వేళ  కార్డ్  దారుడు  విమాన ప్రమాదంలో మరణిస్తే, బీమా కవరేజ్‌ దాదాపు రెట్టింపు అవుతుంది.  (Gold Price March 29th పసిడి రయ్‌​..రయ్‌! పరుగు ఆగుతుందా?)
 
ఎస్‌బీఐకి సంబంధించి వివిధ రకాల కార్డులపై ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఎస్‌బీఐ గోల్డ్‌కు రూ. 2 లక్షలు, ప్లాటినం కార్డ్‌కు రూ. 5 లక్షలు, ప్రైడ్ కార్డ్‌కు రూ. 2 లక్షలు, ప్రీమియం కార్డ్‌కు రూ. 5 లక్షలు, వీసా, సిగ్నేచర్, మాస్టర్‌కార్డ్‌కు రూ. 10 లక్షలు బీమా కవరేజ్ ఉంటుంది. అలాగే ఎస్‌బీఐ డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసిన 90 రోజులలోపు, రూ. 1 లక్షల వరకు నష్టాన్ని కూడా  కవర్ చేస్తుంది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్‌ టైకూన్‌ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
రూ. 1 కోటి వరకు లభించే ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మినహా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అందించే ప్రమాద బీమా కవరేజీ రూ. 5 లక్షలు.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top