మ్యూచువల్ ఫండ్స్‌ పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్‌: నామినీ నమోదు ఎలా?

How to opt nominee for Mutual funds date extended to Sept 30 - Sakshi

సాక్షి,ముంబై: మ్యూచువల్ ఫండ్స్‌, డీమ్యాట్ ఖాతాదారులకు సెబీ భారీ ఊరటనిచ్చింది. నామినీ వివరాల  నమోదుకు గడువు పొడిగిస్తూ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.  ఆయా ఖాతాదారులకు సమర్పించే గడువును ఆరు నెలలపాటు, అంటే ఈ ఏడాది సెప్టెంబరు 30వరకు పొడిగించింది. 

(ఇదీ చదవండి: దిల్‌ ఉండాలబ్బా..! ఆనంద్‌ మహీంద్ర అమేజింగ్‌ వీడియో)
 
ప్రస్తుత డీమ్యాట్‌ ఖాతాదారులు, మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఇన్వెస్టర్లకు నామినీ వివరాలు అప్‌డేట్‌ చేయడం లేదా తొలగించేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గడువు  మార్చి 31తో ముగియనున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే ఈ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది. తొలుత అర్హతగల ట్రేడింగ్, డీమ్యాట్‌ ఖాతాదారులంతా 2022 మార్చి31లోగా నామినీ వివరాలు దాఖలు చేయవలసిందిగా  2021 జూలైలో  సెబీ ఆదేశించింది. ఆ తరువాత  ఈ గడువును పెంచడంతోపాటు 2023 మార్చి31లోగా డీమ్యాట్‌ ఖాతాలు, ఎంఎఫ్‌ ఫోలియోలకు నామినీ వివరాలు జత చేయడం మ్యాండేటరీ చేసింది. (హిప్‌ హిప్‌ హుర్రే! దూసుకుపోతున్న థార్‌ )

నామిని అంటే
నామినేషన్ అనేది మరణం సంభవించినప్పుడు ఖాతాదారుడి ఆస్తులకు వారసుడిగా ఒకవ్యక్తిని నియమించే ప్రక్రియ. ఇన్వెస్టర్లు ప్రారంభించిన కొత్త ఫోలియోలు/ఖాతాలకు నామిని నమోదు తప్పనిసరి. దీంతో పెట్టుబడిదారుడు మరణించిన సందర్భంలో నామినీకి నిధులను బదిలీ చేయడం సులభమవుతుంది. లేదంటే వారి వారసులు ఆయా యూనిట్లను అతడు లేదా ఆమె పేరు మీద బదిలీ చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా వీలునామా, చట్టపరమైన వారసత్వ ధృవీకరణ పత్రం, ఇతర చట్టపర వారసుల నుండి ఎన్‌వోసీలు లాంటి  అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్‌ టైకూన్‌ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు)

నామినీ నమోదు ఎలా? 
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు స్వయంగా సంబంధిత శాఖల ద్వారా, లేదా  CAMD, KFintech వంటి RTA వెబ్‌సైట్‌ల ద్వారా నామినేషన్ పూర్తి చేయవచ్చు. వన్-టైమ్-పాస్‌వర్డ్ (OTP) ధృవీకరణ ద్వారా ఆ ప్రక్రియనుపూర్తి చేయవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top