హిప్‌ హిప్‌ హుర్రే! దూసుకుపోతున్న థార్‌ 

Mahindra Thar production crosses 100000 units in India - Sakshi

సాక్షి, ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా పాపులర్‌ వెహికల్‌ మహీంద్రా థార్ దూసుకుపోతోంది. తన ఐకానిక్ ఆఫ్-రోడర్ 100,000 యూనిట్ల గణనీయమైన ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు  మహీంద్రా తాజాగా  ప్రకటించింది. సరికొత్త థార్‌ లాంచ్‌ చేసిన ​కేవలం రెండున్నర ఏళ్లలోనే ఈ మైలురాయిని సాధించిందని పేర్కొంది.

దేశంలో థార్‌కు లభిస్తున్న ప్రజాదరణ, సక్సెస్‌కి ఇది నిదర్శనమని మహీంద్రా తెలిపింది. అసాధారణ పనితీరు, డిజైన్‌కు గాను ఇప్పటికే పలు అవార్డులు, ప్రశంసలు దక్కించుకుంది.  థార్ ఉత్పత్తిలో 100,000 యూనిట్ల  కీలక మైలురాయిని చేరుకోవడం  చాలా గర్వంగా ఏందని  వీజయ్ నక్రా, (ప్రెసిడెంట్ - ఆటోమోటివ్ డివిజన్, ఎం అండ్‌ లిమిటెడ్) సంతోషాన్ని ప్రకటించారు. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్‌ టైకూన్‌ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు)

మహీంద్రా థార్  అద్భుతమైన  డిజైన్, ఫీచర్లు, కెపాసిటీతో బాగా ఆకట్టుకుంటోంది. ఆల్-టెరైన్ సామర్థ్యాలతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా అందిస్తుంది. థార్ ఇప్పుడు 4x4, ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. పాత థార్‌  రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. వీటిలో 2.0-లీటర్, 4-సిలిండర్ mStallion పెట్రోల్  ఇంజీన్‌ 150 BHP , 320 గరిష్ట్‌ టార్క్‌ను, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజీన్‌  130  బీహెచ్‌పీ పవర్‌ను, 320గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. (Gold Price March 29th పసిడి రయ్‌​..రయ్‌! పరుగు ఆగుతుందా?)

ఇక బలమైన డ్రైవ్‌ట్రెయిన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ , మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్,  షిఫ్ట్-ఆన్-ది-ఫ్లై ట్రాన్స్‌ఫర్ కేస్ వంటి అధునాతన ఫీచర్లతో 4x4 వేరియంట్ ఆఫ్-రోడ్ ఔత్సాహికులకు  సరిజోడి లాంటిది. అలాగే RWD వేరియంట్ థార్ నగరం ,హైవే వినియోగానికి వీలుగా విలక్షణమైన డిజైన్ ,  ఖరీదైన రైడ్ కోసం చూసే వినియోగదారులకు అనువైనది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top