Discounts Up To Rs 50K on Maruti Suzuki IGNIS Baleno in November - Sakshi
Sakshi News home page

Maruti Suzuki సియాజ్‌,ఆల్టో కే10, ఇతర కార్లపై అదిరిపోయే ఆఫర్స్​!

Published Sat, Nov 5 2022 1:18 PM | Last Updated on Sat, Nov 5 2022 3:27 PM

Discounts up to Rs 50k on Maruti Suzuki Ignis Baleno in november - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ కార్ల తయారీ సంస్థలుపలు వాహనాలపై  ఫెస్టివ్‌  సీజన్‌ ముగిసిన తరువాత కూడా డిస్కౌంట్‌ ధరలను ప్రకటిస్తున్నాయి. తద్వారా ఫెస్టివ్‌ జోష్‌ను కొనసాగించి,  తక్కువ ధరలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.  ఈ క్రమంలో హోండా  ఇప్పటికే తగ్గింపు ధరలను ప్రకటించగా, తాజాగా ఈ కోవలో మారుతి సుజుకి చేరింది. నవంబర్ నెలలో నెక్సా లైనప్‌లో మారుతీ సుజుకి బాలెనో, ఇగ్నిస్‌, వ్యాగన్‌-ఆర్‌ లాంటి పలు మోడళ్ల కార్ల కొనుగోలుపై  రూ. 50వేల వరకు తగ్గింపును అందిస్తోంది.

ఆల్టో కే10: పాపులర్‌ మోడల్‌ ఆల్టో కే10పై  అత్యధికంగా రూ. 50వేల వరకు తగ్గింపు లభించనుంది.  ఇందులో క్యాష్​  డిస్కౌంట్‌,  ఎక్స్​ఛేంజ్​ బోనస్​ తదితరాలు ఉన్నాయి. 

మారుతీ సుజుకి సియాజ్: మిడ్‌సైజ్‌ సెడాన్ సియాజ్ అన్ని మాన్యువల్ వేరియంట్‌లపై రూ. 40వేల దాకా, అన్ని ఆటోమేటిక్ వేరియంట్‌లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలతో పొందవచ్చు. 

ఆల్టో 800: ఆల్టో 800 పెట్రోల్​, సీఎన్​జీ వేరియంట్లపై  రూ. 15వేల వరకు క్యాష్​ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 15వేలు , 4 వేల రూపాయల కార్పొరేట్​ డిస్కౌంట్​ ప్రకటించింది. 

సెలేరియో: సెలేరియో బేసిక్​ మేన్యువల్​ వేరియంట్​, సీఎన్​జీ వేరియంట్​పై క్యాష్​ డిస్కౌంట్​ రూ. 20,000గా ఉంది. వీ, జెడ్​, జెడ్​ ప్లస్​ వేరియంట్లపై 25వేల దాకా తగ్గింపును అందిస్తోంది. మిగిలిన సమాచారంకోసం మారుతి సుజరుకి డీలర్ల వద్దగానీ, వెబ్‌సైట్‌లో గానీ  చూడవచ్చు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement