
గురువారం విడుదలైన బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం, డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో.. భారత సంతతికి చెందిన సీఈఓ 'పియూష్ గుప్తా' (Piyush Gupta) వేతనం భారీగా పెరిగింది. 2024 సంవత్సరానికి 56 శాతం వేతన పెంపును పొందారు. దీంతో ఆయన వేతనం 17.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు (రూ. 110 కోట్ల కంటే ఎక్కువ) చేరింది.
సింగపూర్‌కు చెందిన DBS గ్రూప్ హోల్డింగ్స్ సీఈఓ గుప్తా.. 2023లో డిజిటల్ బ్యాంకింగ్ లోపాల కారణంగా 11.2 మిలియన్ సింగపూర్ డాలర్లను వార్షిక వేతనంగా తీసుకున్నారు. ఆ తరువాత ఈయన వేతనం క్రమంగా పెరిగింది. ఇప్పుడు 17.6 మిలియన్లకు చేరింది. కాగా పియూష్ గుప్తా ఈ నెలలో తన పదవిని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో 'టాన్ సు షాన్' నియమితులయ్యారు. ఈయన మార్చి 28 నుంచి DBS గ్రూప్ హోల్డింగ్స్ బాధ్యతలు స్వీకరిస్తారు.
2024 సంవత్సరానికి పియూష్ గుప్తా.. తన ప్యాకేజీలో 6.6 మిలియన్స్ క్యాష్ బోనస్, 2.5 డాలర్స్ ఇతర అలవెన్స్ వంటివి పొందారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న బ్యాంకర్లలో ఒకరిగా నిలిచారు. కాగా మొదటి వ్యక్తి.. స్టాండర్డ్ చార్టర్డ్ సీఈవో 'బిల్ వింటర్స్' ఉన్నారు.
ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్‌లో..
గత 15 సంవత్సరాలుగా.. డీబీఎస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ గణనీయంగా పెరుగుతోంది. 2009లో ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ 35 బిలియన్ సింగపూర్ డాలర్స్ కాగా.. 2024 నాటికి ఇది 124 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 100 బిలియన్ డాలర్ల మార్కును దాటిన సింగపూర్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో చేరింది. 2009లో కేవలం 14,000 మంది ఉద్యోగులు మాత్రమే ఈ బ్యాంకులో పనిచేసేవారు. ఈ సంఖ్య 2024కు 41,000 మందికి చేరింది. డీబీఎస్ బ్యాంక్ సీఈఓ జీతం మాత్రమే కాకుండా.. ఇతర సీనియర్ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment