Daughter In Law Started A Business With Her Mother In Law's Idea They Earns More Than 5 Lakh Per Month - Sakshi
Sakshi News home page

Sonam Success Story: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్‌!

Published Tue, Jul 4 2023 6:36 PM

Daughter in Law Started a Business with her Mother in Law idea they earns more than 5 lakh per month - Sakshi

Sonam Success Story: అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా.. అనే పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు. కానీ ఒక కోడలు లక్షాధికారి కావడానికి  అత్త కారకురాలయింది. చాలా మంది అత్తా కోడళ్ళకు అసలు పడదు, ఇది నిజ జీవితంలో చాలా సందర్భాల్లో చూసి ఉంటారు. కానీ మనం ఈ కథనంలో చెప్పుకోబోయే అత్తా కోడళ్ళు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే అత్త చనిపోయినా ఆమె జ్ఞాపకాలతో అందరికి పంచుతున్న ఈ కోడలు ఎవరు? ఆమె ఎలా ధనవంతురాలయింది? ఆమె చేసే వ్యాపారం ఏది అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

చెన్నైకి చెందిన సోనమ్ (Sonam) అనే యువతి అదే ప్రాంతానికి చెందిన అజయ్ అనే యువకున్ని పెళ్లి చేసుకుంది. చాలా మంది అత్తలు మాదిరిగా కాకుండా సోనమ్ అత్త 'ప్రేమలత' తనను సొంత కూతురిలాగా చూసుకునేది. అయితే కొన్ని రోజులకే  అత్త మరణించడంతో చాలా బాధపడి కృంగిపోయింది. ఆ తరువాత కొన్ని నెలలకు కోలుకున్న సోనమ్ ఒక రోజు తన అత్తా గదిని శుభ్రపరిచే సమయంలో ఆమెకు ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ ఆమెను గొప్ప పారిశ్రామికవేత్తగా మార్చేసింది.

అత్త డైరీ..
సోనమ్ చేతికి దొరికిన దొరికిన ఆ డైరీలో ఎన్నెన్నో వంటలకు సంబంధించిన రెసిపీలు ఉండటం గమనించింది. వీటన్నినీ అలాగే ఎందుకు నిరుపయోగంగా వదిలేయాలి, పది మందికి పంచితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఫుడ్ బిజినెస్ చేస్తే బాగుంటుందని భర్తతో కలిసి నిర్ణయించుకుంది.

డైరీలో తనకిష్టమైన గోంగూర చట్నీ దగ్గర్నుంచి మాల్గోపొడి వరకు అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. ఆ తరువాత వీటిని ప్రయత్నించాలనుకుని అలాంటి వంటకాలు తయారు చేసి భర్త అజయ్‌తో దగ్గరి బంధువులకు అందించడం మొదలుపెట్టింది. ఆ వంటకాలు తిన్న చాలా మంది ఫోన్ చేసి చాలా రుచిగా ఉయన్నాయని మెచ్చుకున్నారు. ఇది ఆమెను మరింత ప్రోత్సహించేలా చేసింది. 

వ్యాపారం ప్రారంభం..
ఒకప్పుడు వంట మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, అయితే అత్తయ్య డైరీ చూడగానే నాలో మార్పు వచ్చిందని చెబుతూనే 'ప్రేమ్ ఇటాసి' (Prem Eatacy) పేరుతో వ్యాపారం ప్రారభించించినట్లు చెప్పింది. ప్రారంభంలో సుమారు రూ. 10 లక్షల పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించి రకరకాల వంటలు చేయడం మొదలు పెట్టింది. వీరి వ్యాపారం ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే న్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కూడా ఆర్డర్‌లను పొందగలిగే స్థాయికి ఎదిగింది.

(ఇదీ చదవండి: బంగారు బుల్లెట్.. అందరి కళ్లు దానిపైనే! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌)

కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా సింగపూర్, అమెరికా నుంచి కూడా కస్టమర్లు సంప్రదించి తమ ఉత్పత్తులు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సోనమ్ భర్త అజయ్ తెలిపాడు. ఇప్పటి వరకు వీరు 21 రకాల ఊరగాయ, పొడి, చట్నీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువ మంది చట్నీ, మొలగపొడి, పుదీనా కొత్తిమీర చట్నీ వంటివి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: రైల్వే స్టేషన్‌లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?)

వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న సోనమ్ ఈ క్రెడిట్ మొత్తం మా అత్తగారికి చెందుతుందని.. ఆమె డైరీ లేకుండా ఉంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండే దానిని కాదని వినయంగా వెల్లడించింది. ప్రస్తుతం వీరి ఉత్పత్తులు స్టోర్లలో మాత్రమే కాకుండా, ఈ కామర్స్ వెబ్‌సైట్లలో కూడా లభిస్తున్నాయి. వారి ఉత్పత్తులు మొత్తం ఆర్గానిక్ పద్దతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించుకోకుండా తయారు చేస్తున్నట్లు సమాచారం. వీరు ఈ బిజినెస్ ద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement