యూట్యూబ్‌లో ‘ఎలన్‌ మస్క్‌ స్కామ్‌’, వందల కోట్లలో నష్టం!

Cybercriminals Stream On Fake Elon Musk Live Streams Fraudsters Made $243,000 In A Week - Sakshi

మీరు బిట్‌ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం యూట్యూబ్‌లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఎలన్‌ మస్క్‌  క్రిప్టో కరెన్సీ వీడియో ప్రిడిక్షన్‌ను నమ్ముతున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. యూట్యూబ్‌లో ఎలన్‌ మస్క్‌ స్కామ్‌ జరుగుతోంది. జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
బిట్‌కాయిన్‌లపై ఎంతమొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలి? ఎంత ఇన్వెస్ట్‌ చేస్తే భవిష్యత్‌ రోజుల్లో భారీ లాభాల్ని ఎలా అర్జిస్తామో? వివరిస్తూ ఎలన్‌ మస్క్‌కు చెందిన వీడియోలు, టెస్లా యూట్యూబ్‌ ఛానల్‌కు చెందిన వీడియోలతో లైవ్‌ స్ట్రీమింగ్‌ జరుగుతోంది. వాస్తవానికి ఆ లైవ్‌ స్ట్రీమింగ్‌ నిర్వహించేది ఎవరో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఈజీ మనీ కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్న సైబర్‌ నేరస్తులే ఆ వీడియోల్ని టెలికాస్ట్‌ చేస్తున్నట్లు తేలింది. ఎలన్‌ మస్క్‌ వీడియోలతో లైవ్‌ స్ట్రీమింగ్‌ నిర్వహించి కేటుగాళ్లు భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. 

ఫేక్‌ క్రిప్టో ట్రేడింగ్‌ వెబ్‌సైట్‌లను తయారు చేస్తున్నారు. ఎలన్‌ మస్క్‌ చెప్పినట్లుగా ఆ వెబ్‌సైట్‌లో క్రిప్టో ట్రేడింగ్‌ నిర్వహిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవ్వొచ్చని నకిలీ యాడ్స్‌తో ఊదరగొట్టేస్తున్నారు. దీంతో టెక్నాలజీ సాయంతో ఎలన్‌ మస్క్‌ వీడియోల్ని ప్రసారం చేయడంతో ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో ఇన్వెస్ట్‌ చేశారు. అలా వారం రోజుల వ్యవధిలో బిట్‌ కాయిన్‌లపై పెద్దమొత్తంలో 23 ట్రాన్సాక్షన్‌లు, ఎథేరియంపై 18 ట్రాన్సాక్షన్‌లు నిర్వహించారు. ఇలా 243,000 డాలర్లు మోసపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

విచిత్రం ఏంటంటే యూట్యూబ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ క్రిప్టో ట్రేడింగ్‌ నిజమని నమ్మి ప్రముఖ చిలీ సంగీతకారుడు ఐసాక్ సైతం మోసపోయాడు. లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియో లింకుల్ని క్లిక్‌ చేయడంతో హ్యాకర్లు ఐసాక్‌ య్యూట్యూబ్‌ ఛానల్‌ను హ్యాక్‌ చేశారు. తాము అడిగినంత ఇస్తే ఛానల్‌ను తిరిగి ఇచ్చేస్తామంటూ ఐసాక్‌ను డిమాండ్‌ చేశారు. దీంతో చేసేది లేక పోలీసుల్ని ఆశ్రయించాడు.   
   
ఈ నేపథ్యంలో తన పేరుమీద జరుగుతున్న మోసాలపై ఎలన్‌ మస్క్‌ స్పందించారు. తన వీడియోలు, టెస్లా యూట్యూబ్‌ ఛానల్‌ అఫీషియల్‌ వీడియోలతో తన పేరుతో స్కామర్లు అమాయకుల్ని దోచుకుంటున్నారని, అలాంటి స్కామ్‌ యాడ్స్‌ను యూట్యూబ్‌ సంస్థ కట్టడి చేయలేకపోతుందంటూ మండిపడ్డారు. వెంటనే లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియోలపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేయాలని ఎలన్‌ మస్క్‌ యూట్యూబ్‌కు విజ్ఞప్తి చేశారు.

చదవండి👉 ‘ఇదే..తగ్గించుకుంటే మంచిది’!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top