సౌరవ్‌ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..!  | Coca-Cola India Extends Partnership With Sourav Ganguly As Ambassador | Sakshi
Sakshi News home page

Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..! 

Oct 13 2021 4:20 PM | Updated on Oct 13 2021 5:26 PM

Coca-Cola India Extends Partnership With Sourav Ganguly As Ambassador - Sakshi

ప్రముఖ బెవరేజస్‌ కంపెనీ కోకాకోలా ఇండియా భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీపై  కీలక నిర్ణయం తీసుకుంది. సౌరవ్‌ను మరో మూడేళ్లపాటు కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగిస్తున్నట్లు కోకాకోలా ఒక ప్రకటనలో పేర్కొంది. 2017లో సౌరవ్‌ గంగూలీను కోకాకోలా ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంపెనీ నియమించింది. మరో మూడేళ్లపాటు సౌరవ్‌ గంగూలీతో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని కోకాకోలా ఇండియా అండ్‌ సౌత్‌ వెస్ట్‌ ఆసియా వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్నబ్‌ రాయ్‌ అన్నారు. 
చదవండి: భారత్‌ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..!

బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్‌లో దాదా దూకుడు..!
భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్స్‌లో దూకుడును ప్రదర్శిస్తున్నారు. సౌరవ్‌ ఇప్పటకీ డీటీడీసీ, టాటా టెట్లీ, పుమా, ఎస్లియర్‌ లెన్స్, సెన్కో గోల్డ్‌ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ఒక ఏడాది పాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం కోసం సౌరవ్‌ ఒక్కో బ్రాండ్‌ నుంచి  సుమారు కోటి రూపాయలను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
చదవండి: రూ.15 లక్షలలో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే! మీరు ఓ లుక్కేయండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement