అప్పట్లో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి

Chinese Billionaire Hui Ka Yan Loses His Wealth 93 Pc Says Report - Sakshi

జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అదృష్టం కలిసొచ్చి ధనవంతునిగా మారడం, కాలం కలిసిరాకపోతే అదే బిలియనీర్ స్థాయి నుంచి బీదవాడుగానూ మారుతుంటారు. ప్రస్తుతం చైనాకు చెందిన ఓ సంపన్న వ్యక్తి పరిస్థితి సరిగ్గా ఇలానే ఉంది. వివరాల్లోకి వెళితే.. డ్రాగన్‌ దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్‌ చైర్మన్‌ హుయ్‌ కా యన్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. కరోనా మహ్మామారి దెబ్బ, ఆర్థిక మాంద్యం ప్రభావాల కారణంగా తన సంపదలో ఆయన దాదాపు 93 శాతం కోల్పోయారు.

భారీ షాక్‌.. 93 శాతం ఆస్తి పోయింది..
గతంలో హుయ్‌ ఆస్తి విలువ 42 బిలియన్‌ డాల్లరు ఉండగా, ఆసియాలోనే రెండు అత్యంత సంపన్నుడిగా పెరు కూడా సంపాదించారు. అయితే ప్రస్తుతం అది 3 బిలియన్ల డాలర్లకు తగ్గిపోయిందని బ్లాంబర్గ్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. తన కంపెనీని కాపాడుకోవడంలో భాగంగా ఈ బిలియనీర్ తన ఇళ్లు, ప్రైవేట్ జెట్‌లను కూడా అమ్మకున్నట్లు సమాచారం. 

2021 నుంచి చైనాలో రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంతో సంస్థ నష్టాలపాలైంది. 2020లో $110 బిలియన్ల కంటే పైగా అమ్మకాలతో పాటు 280 కంటే ఎక్కువ నగరాల్లో 1,300పైగా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా ఉన్న ఈ సంస్థ తాజాగా అప్పులు ఊబీలో కూరుకపోయింది.

అంతేకాకుండా ఈ గ్రూప్‌ ప్రస్తుతం ఆ దేశంలో అత్యంత రుణాలు కలిగిన సంస్థగా నిలిచింది.  2008 నుంచి సీపీపీసీసీలో(CPPCC), 2013 నుంచి అందులోని ఎలైట్ 300-సభ్యుల స్టాండింగ్ కమిటీలో హుయ్‌ కా యన్‌ భాగంగా ఉన్నారు. అయితే ఇటీవల తన సంపద దారుణంగా పడిపోయిన నేపథ్యంలో గత సంవత్సరం వార్షిక సమావేశానికి హాజరుకావద్దని సమాచారం రావడంతో పాటు వచ్చే ఐదేళ్లపాటు సీపీపీసీసీని ఏర్పాటు చేసే వ్యక్తుల తాజా జాబితా నుంచి ఆయనను మినహాయించారు.

చదవండి: బిలియనీర్‌ గౌతం అదానీకి ఝలక్‌, 24 గంటల్లో..

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top