ఫిలిం అవార్డు చెక్స్‌ బౌన్స్‌ గందరగోళం: విజేతలకు చేదు అనుభవం

Cheques Given To Assam State Film Award Winners Bounce - Sakshi

గువహటి: అసోం రాష్ట్ర చలనచిత్ర అవార్డు విజేతలకుచేదు అనుభవం ఎదురైంది. వారికిచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో  గందరగోళం నెలకొంది. ఎనిమిది మంది విజేతలకు ఇచ్చిన చెక్కులను క్లియరెన్స్ కోసం బ్యాంకుకు సమర్పించినప్పుడు అవి బౌన్స్‌ అయ్యాయి. సాంస్కృతిక వ్యవహారాల డైరెక్టర్ మీనాక్షి దాస్ నాథ్ సంతకంతో జారీ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కులు మార్చి 17న బౌన్స్ అయ్యాయి. దీంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లు వెత్తాయి. ఈ వ్యవహారంపై సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బిమల్ బోరా తక్షణ విచారణకు ఆదేశించారు.

వివరాలను పరిశీలిస్తే చలన చిత్ర రంగానికి చెందిన ఎనిమిది మందికి స్టేట్ ఫిల్మ్ ఫైనాన్స్ అండ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ASFFDC సోమవారం అవార్డులను ప్రదానం చేసింది  దీంతో అవార్డు గ్రహీత  రచయిత అపరాజిత పూజారి చెక్కును డిపాజిట్‌ చేశారు. అయితే అది బౌన్స్ అయిందని బ్యాంకు నుండి కాల్ రావడంతో నిర్ఘాంతపోయి, నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.  (ఐఫోనా మజాకా? మైనర్‌ కిడ్నాప్‌ డ్రామా...కట్‌చేస్తే..!)

పూజారి ఉత్తమ రచయితగా అవార్డును గెలుచుకున్నారు. అయితే పూజారితోపాటు, అమృత్ ప్రీతమ్ (సౌండ్ డిజైన్), దేబజిత్ చంగ్మాయి (సౌండ్ మిక్సింగ్), ప్రాంజల్ దేకా (దర్శకత్వం), దేబజిత్ గయాన్ (సౌండ్ డిజైన్ అండ్‌  మిక్సింగ్)  బెంజమిన్ డైమరీ (నటన) వంటి ఇతర ప్రముఖ సినీ ప్రముఖులకు అందజేసిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయట. 

(ఇదీ చదవండి: రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే?)

అయితే సాంకేతిక కారణాల వల్ల చెక్కులు బౌన్స్ అయ్యాయని సంబంధిత అధికారి  వెల్లడించారు. మొదటి రోజు రూ.18 లక్షల విలువైన చెక్కులు క్లియర్ చేశామనీ, రెంcy రోజు తొమ్మిది చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు. సమస్యను పరిష్కరించామని, తమ చెక్కులను డిపాజిట్ చేయాలని,  ఈసారి క్లియర్‌ అవుతాయంటూ మొత్తం ఎనిమిది మందికి  శనివారం వ్యక్తిగతంగా సమాచారం అందించినట్టు తెలిపారు.

ఇది మాత్రమే కాదు ఈ అవార్డుల్లో మరో తప్పిదం కూడా చోటు చేసుకుంది. ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్ అవార్డును నహిద్ అఫ్రిన్‌కు ఆమె పాడని పాటకు  స్వీకరించారంటూ వివాదం  రేగింది. అయితే అఫ్రీన్ 'నిజానోర్ గాన్' చిత్రంలో పాడిన ఆఫ్రీన్‌కే అవార్డు వచ్చిందని, తప్పిదం జరిగిందని సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రకటించడం గమనార్హం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top