తాత చేసిన పని.. 30 ఏళ్ల తర్వాత ఎగిరి గంతేసిన మనువడు

Chandigarh Doctor Gets A Windfall From Grandfather Forgotten Sbi Shares Bought In 1994 - Sakshi

మనలో చాలా మంది..నేను ఎప్పటికైనా లక్షాధికారిని కాకపోతానా? కోటీశ్వరుణ్ణి కాకపోతానా? అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. అయితే అలా ధనవంతులు కావాలంటే లక్షలు కావాల్సిన పనిలేదు. వందల్లో పొదుపు చేసినా అది ధనవంతుల్ని చేస్తుందని నిజం చేశారు ఓ పెద్దాయన.

కేవలం రూ.500 పెట్టుబడి కాస్తా ఇప్పుడు రూ.3.75 లక్షలుగా మారడంతో మనవుడు తన తాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది.    

చండీగఢ్‌కు చెందిన తన్మయ్‌ మోతీవాలా పీడియాట్రిక్‌ సర్జన్‌గా వైద్య సేవలందిస్తున్నారు. అయితే ఓ రోజు తన ఇంటిని సర్ధుతుండగా తాత వినియోగించిన ఓ ట్రంక్‌ పెట్ట మోతీవాలా కంటపడింది. అందులో ఏమున్నా​యా? అని తెరిచి చూశాడు. అంతే అప్పుడే తాత పెట్టిన పెట్టుబడి చూసి ఎగిరి గంతేసినంత పనిచేశారు. 

అయితే ఆ ట్రంక్‌ పెట్టెలో 1994లో తన తాత రూ. 500 విలువైన ఎస్‌బీఐ షేర్లను కొనుగోలు చేసినట్లు, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను షేర్‌ చేశారు. తన తాత షేర్లను కొనుగోలు చేశారు. వాటిని అమ్మలేదని తర్వాత గుర్తించాడు. ఆ రూ.500 పెట్టబడితో వచ్చిన ప్రాఫిట్‌ ఎంత వచ్చిందో ఆరా తీశారు.  

1994లో ఒక్కో షేర్‌ రూ.10 చొప్పున రూ.500కి మొత్తం 50 షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ మొత్తం షేర్ల విలువ రూ.3.75లక్షలకు చేరింది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టిన మొత్తం 750 శాతంతో రిటర్న్స్‌  వచ్చాయని డాక్టర్‌ మోతీవాలా వెల్లడించారు. 

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top