పాస్‌పోర్ట్‌కు వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను లింక్‌ చేశారా? ఎలాగో తెలుసుకోండి!

How To Link Covid Vaccination Certificate To Passport In Telugu Through Cowin - Sakshi

ప్రపంచ దేశాల్లో విమాన ప్రయాణాలకు మార్గం సుమగమైంది. ఇన్ని రోజులు ఎయిర్‌ పోర్ట్‌లకే పరిమితమైన విమానాలు..ఇప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అయితే కరోనా కారణంగా ఆయా దేశాలు ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు భారత్‌ తో పాటు ఇతర దేశాల్లో కూడా అమలవుతున్నాయి. దేశాల్ని బట్టి ఈ ఆంక్షలు అమలవుతుండగా.. ఎక్కువ శాతం కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకున్న వారినే అనుమతిస్తుండగా.. వారికి వ్యాక్సిన్‌ పాస్‌ పోర్ట్‌ను తప్పనిసరి చేశాయి.   

మన దేశంలో మాత్రం పాస్‌ పోర్ట్‌ కు వ్యాక్సిన్‌ వేయించున‍్న సర్టిఫికెట్‌ ను అందిస్తే సరిపోతుంది.  ఎవరైతే రెండు డోసులు వ్యాక్సిన​ వేయించుకుంటారో.. ఆ ప్రయాణికులు సంబంధిత పాస్ట్‌ పోర్ట్‌ పోర్టల్‌ లో మీరు ఏ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఎప్పుడు వేయించుకున్నారనే సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన ప్రయాణికులకు మాత్రమే కేంద్రం వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ అందిస్తుంది. మరి ఈ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను ఎలా అప్లయ్‌ చేయాలో తెలుసుకుందాం.  

ఎలా అప్లయ్‌ చేయాలి 

విదేశాలకు వెళ్లే ప్రయాణికులు కోవిన్‌ పోర్టల్‌లో పాస్‌ పోర్ట్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది. 

ముందుగా ప్రభుత్వానికి చెందిన http://cowin.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.

లాగిన్‌ అయిన వెంటనే మనం వ్యక్తిగత వివరాలు డ్యాష్‌ బోర్డ్‌ లో మనకు కనిపిస్తాయి. 

ఆ డ్యాష్‌ బోర్డ్‌ ( హోమ్‌ స్క్రీన్‌ ) లో రెయిజ్ యాన్ ఇష్యూ (Raise an Issue) బాక్స్ ఆప్షన్‌ కనిపిస్తుంది. 

ఆ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి. క‍్లిక్‌ చేస‍్తే మీరు కోవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌  వేయించుకున్నారా అనేది ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

అనంతరం సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి.  అక్షరదోషాలు ఏవైనా ఉంటే దాన్ని ఎడిట్ చేసుకునే సౌకర్యం ఉంది.  

చదవండి:  Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడో తెలుసా ?

 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top