
ఆర్థిక ఫలితాల డాక్యుమెంట్ల పరిశీలన
పోటీ నిబంధనల ఉల్లంఘన నేపథ్యం
జాబితాలో ఇండియా సిమెంట్స్
దాల్మియా భారత్ సిమెంట్స్, శ్రీ దిగి్వజయ్
న్యూఢిల్లీ: పోటీ నిబంధనల ఉల్లంఘన దర్యాప్తులో భాగంగా ఆర్థిక ఫలితాల వివరాలను దాఖలు చేయమంటూ సిమెంట్ రంగ దిగ్గజాలు అ్రల్టాటెక్, దాల్మియా భారత్, శ్రీ దిగి్వజయ్‌ను కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆదేశించింది. ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలతోపాటు.. బ్యాలన్స్ షీట్, లాభనష్టాల ఖాతా వివరాలను 8 వారాలలోగా అందించాలని పేర్కొంది.
పోటీ నిబంధనలు ఉల్లంఘించినట్లు డైరెక్టర్ జనరల్ గుర్తించిన నేపథ్యంలో మూడు సెమెంట్ రంగ కంపెనీలను సీసీఐ తాజాగా ఆదేశించింది. అయితే అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న ఇండియా సిమెంట్స్‌కు చెందిన ఐదేళ్ల వివరాల కోసం అల్ట్రాటెక్‌కు సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. 2015–19 ఆర్థిక సంవత్సరాల ఖాతాల వివరాలను వెల్లడించవలసి ఉంటుందని పేర్కొంది.
ఈ బాటలో దాల్మియా భారత్ సిమెంట్స్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్‌ను 2011 నుంచి 2019వరకూ తొమ్మిదేళ్ల కాలానికి ఆర్థిక వివరాలను దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా ఐదేళ్ల కాలానికి ఆదాయపన్ను రికార్డులు, ఆర్థిక వివరాలను సమూలంగా తెలియజేయవలసిందిగా ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను సైతం ఆదేశించింది. దర్యాప్తు నివేదికపై లాంచనప్రాయ సమాధానాలను సైతం సమరి్పంచమంటూ ఆదేశించింది.
కాగా.. ఈ అంశాలపై అ్రల్టాటెక్, దాల్మియా భారత్ స్పందించలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తమ టెండర్లలో జట్టుకడుతున్నట్లు సిమెంట్ రంగ కంపెనీలపై ఇంధన రంగ పీఎస్‌యూ ఓఎన్‌జీసీ ఫిర్యాదు చేయడంతో సీసీఐ తాజా ఆదేశాలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో 2020 నవంబర్ 18న సీసీఐ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టవలసిందిగా డైరెక్టర్ జనరల్(డీజీ)ను ఆదేశించింది. 2025 ఫిబ్రవరి 18న డీజీ దర్యాప్తు నివేదికను సీసీఐకు అందించింది.
తదుపరి 2025 మే 26న ఓఎన్‌జీసీకి సిమెంట్ అమ్మకాల ద్వారా అందుకున్న ఆదాయ వివరాలను దాఖలు చేయవలసిందిగా ఈ మూడు సిమెంట్ తయారీ కంపెనీలకు సూచించింది. 2024 డిసెంబర్‌లో ఇండియా సిమెంట్స్ ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటాను అ్రల్టాటెక్ సిమెంట్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. మార్కెట్ నుంచి మరో 22.77 శాతం వాటా సైతం సొంతం చేసుకుంది. వెరసి ఇండియా సిమెంట్స్‌కు ప్రమోటర్‌గా అ్రల్టాటెక్ అవతరించింది.