ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీపై సీబీఐ అభియోగం

CBI Charges Son Of Noida Builder Gaursons In Bank Fraud - Sakshi

న్యూఢిల్లీ :  ప్ర‌ముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ 'గౌర్సన్స్'  కుటుంబస‌భ్యులపై నిధుల దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ట్లు కేసు న‌మోదైంది.   80 కోట్ల రూపాయ‌ల మోసానికి పాల్ప‌డిన‌ట్లు సీబీఐ అభియోగం మోపింది.  బ్యాంక్ ఆఫ్ బరోడా , సిండికేట్ బ్యాంకుల నుంచి  గౌర్సన్స్ చైర్మన్ బిఎల్ గౌర్ ,  అతని భార్య నవనీత్ ,కుమారుడు రాహుల్ గౌర్ బ్యాంకుల నుంచి  80 కోట్ల రూపాయలకు మోసం చేశారని అధికారులు వెల్ల‌డించారు.  (ఇద్దరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులు అరెస్ట్‌)

నోయిడాలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌తో  కూడిన హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు స‌ద‌రు  కంపెనీ 250 కోట్ల రూపాయలు (బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 150 కోట్లు, సిండికేట్ బ్యాంక్ నుంచి రూ .100 కోట్లు) తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ద‌శ‌ల వారిగా చిల్లించాల్సిన డ‌బ్బును చెల్లించ‌డం లేద‌ని, అంతేకాకుండా ప్రాజెక్టు కూడా ప్రారంభ ద‌శలోనే ఆగిపోయింద‌ని బ్యాంక్ ఆఫ్ బరోడా  త‌న ఫిర్యాదులో పేర్కొంది. త‌ప్పుడు లెక్క‌లు చూపించి , ప్రాజెక్టు నిర్మిస్తిన్న‌ట్లు అవాస్తవాల‌ను చూపించి నిధుల దుర్వినియోగానికి పాల్ప‌డ్డారంటూ ఆరోపించింది. (బీఎస్‌4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top