కార్జ్‌సో వీఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ ప్రారంభం

Carzso.com Re launches VR based Experience store At Karnal In Haryana - Sakshi

ముంబై: ఆటో టెక్‌ స్టార్టప్‌ సంస్థ కార్జ్‌సోడాట్‌కామ్‌ తాజాగా హర్యానాలోని కర్నాల్‌లో వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) ఆధారిత ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ ప్రారంభించింది. దేశీయంగా ఈ తరహా స్టోర్‌ ఏర్పాటు కావడం ఇదే తొలిసారని సంస్థ తెలిపింది. 25 కార్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మెట్రోయేతర నగరాల్లోకి మరింతగా విస్తరించేందుకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు మరిన్ని ప్రారంభించనున్నట్లు వివరించింది.

సాధారణంగా ప్రీ–ఓన్డ్‌ కార్లను కస్టమర్లు స్వయంగా వెళ్లి చూసి, షార్ట్‌లిస్ట్‌ చేసి, కొనుక్కునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయని కంపెనీ వ్యవస్థాపక సీఈవో వైభవ్‌ శర్మ తెలిపారు. వీఆర్‌ సాంకేతికతతో తక్కువ సమయంలోనే మరిన్ని ఉత్పత్తులను చూసేందుకు కస్టమర్లకు వీలుంటుందని పేర్కొన్నారు. దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమలో వీఆర్‌ టెక్నాలజీని మరింత వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా ఆటోమోటివ్‌ పరిశ్రమలో వీఆర్‌ మార్కెట్‌ ప్రస్తుతం 1 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా 2027 నాటికి 15 బిలియన్‌ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నట్లు శర్మ చెప్పారు. కార్జ్‌సోడాట్‌కామ్‌.. గుర్గావ్‌లో అత్యంత భారీ స్థాయిలో ప్రీ–ఓన్డ్‌ కార్ల తొలి సూపర్‌స్టోర్‌ నిర్మిస్తోంది. ఇందులో 300 పైగా కార్లకు పార్కింగ్‌ ఉంటుంది.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top