కెనరా బ్యాంక్‌కు ఈజ్‌ 4.0 సంస్కరణల సూచీ అవార్డు | Canara Bank Receives Ease Reforms Index Award From Fm Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

కెనరా బ్యాంక్‌కు ఈజ్‌ 4.0 సంస్కరణల సూచీ అవార్డు

Sep 20 2022 7:40 AM | Updated on Sep 20 2022 8:04 AM

Canara Bank Receives Ease Reforms Index Award From Fm Nirmala Sitharaman - Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ‘ఈఏఎస్‌ఈ (ఈజ్‌) 4.0 సంస్కరణల సూచీ అవార్డు, 2022’ లభించింది. అత్యుత్తమ పనితీరుకు గాను 2021–22 మార్చి త్రైమాసికానికి సంబంధించి ఈజ్‌ అవార్డు  మూడవ ర్యాంక్‌ను దక్కించుకున్న బ్యాంక్,  ‘ప్రూడెంట్‌ బ్యాంకింగ్‌ ఇన్‌స్టిట్యూషనలైజింగ్‌ థీమ్‌’ కింద మొదటి బహుమతిని కూడా అందుకుంది.

ముంబైలో ఐబీఏ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ చేతుల మీదుగా ఈజ్‌ 4.0 సంస్కరణల సూచీ అవార్డును అందుకుంటున్న బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ను చిత్రంలో తిలకించవచ్చు. దీర్ఘకాల సుస్థిర వ్యాపారవృద్ధి, డిజిటల్‌ సామర్థ్యాల విభాగాల్లో బ్యాంక్‌ చక్కటి పనితీరు కనబరుస్తున్నట్లు ప్రభాకర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే!

Advertisement
 
Advertisement
Advertisement