Canara Bank Hikes Fixed Deposit Interest Rates Up To 135 Bps - Sakshi
Sakshi News home page

ఫెస్టివ్‌ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త!

Oct 8 2022 12:00 PM | Updated on Oct 8 2022 12:30 PM

Canara Bank hikes Fixed Deposit interest rates - Sakshi

హైదరాబాద్‌: ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు ప్రత్యేక టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను తన కస్టమర్ల కోసం ప్రకటించింది.  అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల వరకు పెంచి  తన ఖాతాదారులకు ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో గుడ్‌ న్యూస్‌ అందించింది. కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం సవరించిన కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుండి అమలులోకి వచ్చాయి. (మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌, ధర తక్కువ, ఇక జియో ఆఫర్‌  తెలిస్తే!)

666 రోజుల కాల వ్యవధికి డిపాజిట్‌ చేస్తే 7 శాతం వార్షిక రేటును ఆఫర్‌ చేస్తోంది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇదే డిపాజిట్‌పై అర శాతం అధికంగా 7.50 శాతం రేటును ఆఫర్‌ చేస్తోంది. రూ.2 కోట్లలోపు ఉండే డిపాజిట్‌లకు ఇది వర్తిస్తుందని కెనరా బ్యాంకు ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకు నుంచి ఇది అత్యధిక రేటుగా పేర్కొంది.   (సంచలనం: ఓలా, ఉబెర్‌, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం)

ఇదీ చదవండి :  హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేసింది.. బుకింగ్‌.. ఫీచర్లు, ధర వివరాలు

Advertisement
 
Advertisement
Advertisement